Advertisement
Google Ads BL

ఒక బ్లాక్‌బస్టర్, అట్టర్ ప్లాప్ మిస్సయ్యా: రకుల్


ఒక బ్లాక్ బస్టర్, ఒక అట్టర్ ప్లాప్ మూవీ అవకాశాలను ఎలా కోల్పోయిందో రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక్కో హీరోయిన్ కి ఒక్కసారి మంచి అవకాశాలు వచ్చినట్టే  వచ్చి చేజారుతుంటాయి. అలానే రకుల్ కూడా ఏకంగా రెండు అవకాశాలను కెరీర్ తొలినాళ్లలోనే కోల్పోయిందట. కెరీర్ ఆరంభంలోనే పోకిరి తర్వాత పూరి జగన్నాధ్ నుండి తనకి ఓ భారీ ఆఫర్ వచ్చిందట. దాదాపుగా 60 రోజుల కాల్షీట్స్ ఉన్న ఆఫర్ అట కానీ రకుల్ మాత్రం నేను మాథ్స్ ఆన్సర్స్ చేస్తున్నా 60 రోజులంటే కుదరదు.. ఏ 10 రోజుల కాల్షీటో ఉంటే ఇవ్వమని అడిగితే దానికి పూరి నువ్వు గెస్ట్ కేరెక్టర్స్ వెయ్యడానికి కాదు.. నీకు గుడ్ ఫ్యూచర్ ఉంది అని చెప్పాడట. అప్పట్లో చిన్న, చితక గెస్ట్ రోల్స్ వేస్తే కెరీర్ నిలబడదని తెలిసేది కాదట. ఇక ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ ఆఫర్ తనకి వచ్చింది అని.. కాజల్ చేసిన ప్రియా పాత్ర ముందు తనకే వచ్చి స్క్రీన్ టెస్ట్ ఫోటో షూట్ జరిగింది అని.. కానీ ఏమైందో ఏమో తర్వాత కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారని అంటుంది. అయితే అప్పటికే డార్లింగ్ తో కాజల్ - ప్రభాస్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకోవడంతోనే మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ లో కొత్తమ్మాయి ఎందుకు కాజల్ నే తీసుకుని ఉంటారని అది తనకి తెలియదు అంటుంది.

Advertisement
CJ Advs

ఇక రెండో అవకాశం అట్టర్ ప్లాప్ అవకాశం. అది నాగ చైతన్యతో ఆటో నగర్ సూర్య అవకాశం కూడా వచ్చినట్టే వచ్చి చేజారింది అంటుంది. ముందు ఆటో నగర్ సూర్య కోసం సమంతనే సంప్రదించారు. కానీ ఆమెకి డేట్స్ ఖాళీ లేక నన్ను తీసుకున్నారు. కానీ మళ్ళీ సమంత డేట్స్ అడ్జెస్ట్ చేయడంతో చైతుకి జోడీగా సమంతనే తీసుకున్నారని... మిస్టర్ పర్ఫెక్ట్ అప్పట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ అని తెలియదు.. ప్రియా పాత్రకి రకుల్ అనగానే ఆనందం వేసింది. వారంలో ఎగ్జామ్స్ ఉన్న కారణంగా సెట్ లో కూడా చదువుతూ కూర్చునేదాన్ని.. కానీ ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఆఫర్ మిస్ అయినప్పుడు కాస్త బాధేసింది అని అంటుంది రకుల్. రెండుసార్లు పెద్ద షాక్ తగిలేసరికి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి.. ఫైనల్ ఇయర్ లో మిస్ ఇండియా కాంపిటేషన్ కి వెళ్ళాను. ఇక తర్వాత నా కెరీర్ దక్షిణాదిన నెమ్మదిగా మొదలైంది అని చెబుతుంది.

I Missed One Block Buster and one Utter flop Film says Rakul :

Rakul preet singh missed Mr perfect and Autonagar surya movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs