RRR షూటింగ్ మొదలెట్టడానికి రాజమౌళి అన్ని రెడీ చేసుకుని కూర్చున్నాడు. కరోనా కారణంగా ముందు టెస్ట్ షూట్ అయ్యాకే అసలు షూట్ మొదలు పెట్టాలి. అయితే గత వారం రోజులుగా రాజమౌళి టెస్ట్ షూట్ కూడా కరోనా మహమ్మారి పెరిగిపోతుండడంతో అటకెక్కినట్లుగా ప్రచారం జరుగుతుంది. టెస్ట్ షూట్ చేసాక కూడా హీరోలు సెట్స్ మీదకొస్తారంటే నమ్మకం లేదు. అయితే రాజమౌళి తాజాగా అలియా భట్ ని పిలిపించడానికి రెడీ అవుతున్నాడని.. అలియా భట్, రామ్ చరణ్ కాంబో సీన్స్ ని షూట్ చేద్దామని రాజమౌళి అనుకుంటున్నాడనే టాక్ అలియా భట్ కి తెలిసిందట. అసలైతే అలియా భట్ మే, జూన్ కాల్ షీట్స్ RRR కోసం కేటాయించింది.
కానీ కరోనా కారణంగా అంతా తల్లకిందులైంది. అయితే ఇప్పుడు రాజమౌళికి అలియా భట్ ఫోన్ చేసినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్. ముఖ్యంగా దేశంలో అత్యంత నష్టపోయిన నగరమైన ముంబైలో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో... ప్రత్యేక పరిస్థితుల కారణంగా తాను వెంటనే RRR కోసం డేట్స్ కేటాయించలేనని రాజమౌళితో అలియా భట్ చెప్పినట్టుగా టాక్. అలాగే రాజమౌళి షూటింగ్ ప్లాన్స్ ని కూడా అలియా ఫోన్ లో కనుక్కుందని అంటున్నారు. ఇక పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మాత్రమే అలియా భట్ RRR షూటింగ్ కోసం ముంబై నుండి వస్తుందని అని తెలుస్తుంది. మరి రాజమౌళి కూడా అలియా చెప్పిన దానికి ఒప్పుకుని.. ముందు ట్రయిల్ షూట్ తర్వాతే మిగతా పనులు అంటున్నాడట.