Advertisement
Google Ads BL

నభా నటేష్‌కి అద్దిరిపోయే ఆఫర్..!


ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ పోరిగా రామ్‌ని లైక్ చేసే హాట్ అమ్మాయిగా నభా నటేష్ తెలంగాణ భాషలో అదరగొట్టేసింది. నభా నటేష్‌కి ఇస్మార్ట్ హిట్ తర్వాత అంతగా క్రేజ్ కానీ.. అవకాశాలు కానీ రాలేదు. ఇస్మార్ట్ తర్వాత నభా నటేష్‌ నటించిన డిస్కో రాజా ప్లాప్. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్‌ నటిస్తుంది. అలాగే మెగా హీరో సరసన ఓ ఆఫర్ అన్నారు కానీ... తాజాగా నభా నటేష్‌కి ఓ బంపర్ ఆఫర్ తగిలినట్టుగా టాక్. అది కూడా స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన అంటున్నారు. ప్రస్తుతం RRR సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమా చెయ్యాలి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ లుక్ ఫైనలైజ్ చేస్తున్నాడట. కరోనా కారణంగా తక్కువ మంది పాల్గొంటూ ఎన్టీఆర్ లుక్ టెస్ట్ చేస్తున్నారనే ఫిలింనగర్ టాక్.

Advertisement
CJ Advs

ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని.. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఖద్దరు చొక్కాతో కనబడతాడని.. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ ఖద్దర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. అయితే ఈ సినిమాలో కథానుసారంగా ఎన్టీఆర్ కి ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. ఎప్పటిలాగే త్రివిక్రమ్ తన కథకి ఇద్దరి హీరోయిన్స్ ని రాసుకున్నాడట. అయితే మెయిన్ లీడ్ కోసం బాలీవుడ్ భామని తీసుకువస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఓ హీరోయిన్ గా ఇస్మార్ట్ పోరి నభా నటేష్‌కి అవకాశం దక్కినట్టుగా టాక్. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగానే నభా నటేష్‌ కనిపిస్తుంది అని అంటున్నారు. అయితే నభా నటేష్‌‌కి ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ దక్కిందా లేదా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దొరికిందా అనేది  క్లారిటీ లేదు.

Bumper Offer to Heroine Nabha Natesh:

Nabha Natesh In Jr NTR and Trivikram Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs