Advertisement
Google Ads BL

పాయల్ రాజపుత్ రెడీగా ఉందంట..!


కరోనా లాక్‌డౌన్ ఆగిపోయిన షూటింగ్స్ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. అందుకే పాయల్ రాజపుత్ కూడా తన సినిమా షూటింగ్ కోసం మొన్నామధ్యన ఫుల్ సూట్‌లో ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చేసరికి పాయల్ కొత్త సినిమా షూటింగ్ కోసం ఫ్లైట్ ఎక్కేసింది అనుకుంటే.. కాదు.. నేనింకా షూటింగ్ లో జాయిన్ కాలేదు అంటుంది. తాజాగా సోషల్ మీడియా లైవ్ చాట్‌లోకొచ్చిన పాయల్ రాజపుత్... ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా హైదరాబాద్‌కి ఎగిరిపోవాలని ఉందని చెబుతుంది. నటనంటే నాకు పిచ్చి అంటున్న పాయల్ రాజపుత్... నా జీవితంలో సినిమాల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తా అని చెబుతుంది.

Advertisement
CJ Advs

మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని ఓ అభిమాని అడగగానే.. అభిమానులే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తెలివైన సమాధానం చెప్పిన పాయల్.. లేవగానే ఏ చేస్తుందో చెప్పుకొచ్చింది. నిద్ర నుండి లేవగానే లెమన్ వాటర్ తాగేస్తుందట. తర్వాత గార్లిక్ బట్టర్‌తో ఆలు పోరాట, పోహా లాగించేస్తా అని చెబుతుంది. కరోనా లాక్ డౌన్ టైం లో నా పేరెంట్స్ తో టైం స్పెండ్ చేశాను.. ఇది నా లైఫ్ లో మరువలేని సమయం అని చెబుతుంది పాయల్. ఈ లాక్ డౌన్ సమయంలో నన్ను నేను వెతుక్కున్నా.. అన్ని కలిసొస్తే వచ్చే నెలలోనే షూటింగ్స్ లో జాయిన్ అవుతా అని చెబుతుంది.

Payal Rajput Ready to Shootings:

Payal Rajput Chit Chat Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs