టాలీవుడ్ సెలెబ్రిటీలందరికీ సడెన్ షాక్ ఇస్తూ తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్ ని పరిచయం చేసి, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నానంటూ చెప్పిన రానా దగ్గుబాటి వివాహనికి వేదిక సిద్ధమవుతోంది. ముంబైకి చెందిన వెడ్డింగ్ ప్లానర్ మిహీకా బజాజ్ ని పెళ్ళి చేసుకోబోతున్న రానా వివాహం, హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా హోటల్ లో జరగనుందని సమాచారం. ముందుగా సురేష్ బాబు రానా- మిహీకాల పెళ్ళి వేడుకని రామానాయుడు స్టూడియోలో జరిపించాలని అనుకున్నారట.
కానీ ఇరువురు కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత తాజ్ ఫలక్ నుమా అయితే బాగుంటుందని అనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వివాహ తేదీ ఆగస్టు 8 అని అనుకుంటున్నారట. అయితే ఈ వివాహానికి ఇండస్ట్రీకి చెందిన వారందరినీ పిలుస్తారా అన్నది సందేహమే. హైదరాబాద్ లోని ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇరు కుటుంబసభ్యుల కి దగ్గరగా ఉండేవారినే ఆహ్వానించే అవకాశం ఉందని భావిస్తున్నారు.