Advertisement
Google Ads BL

సీరియల్స్ స్టార్ట్ అంటూ ఆనందపడుతున్నారా?


ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్స్ సంగతేమో గాని.. సీరియల్స్ షూటింగ్స్ మాత్రం జోరుగా మొదలయ్యాయి. జీ తెలుగు, స్టార్ మా, జెమిని, ఈ టివి సీరియల్స్ షూటింగ్స్ మొదలవడమే కాదు.. రేపు సోమవారం నుండి మళ్లీ ప్రేక్షకులముందుకు రాబోతున్నాయని. ఇంతకుముందు రెండు నెలలుగా సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయినందున బుల్లితెర ప్రేక్షకులు తెగ బోర్ ఫీలవుతున్నారు. మరోపక్క ఆర్టిస్ట్ లు కూడా పని లేక బోర్ ఫీలవ్వడం షూటింగ్స్ కి అనుమతులు లభించడంతో.. సీరియల్స్ స్టార్స్ అంతా సెట్స్ లో వాలిపోయారు. అంతేకాదు... అప్పుడే యాడ్స్ కూడా రెడీ చేసి మా సీరియల్స్ మీ ఇష్టమైన ఛానల్ లో అంటూ హడావిడిగా ఆవేశంగా చేస్తున్నారు. మరోపక్క యాంకర్స్ కూడా తమ తమ షోస్ కోసం మేకప్ వేసేసుకుని సెట్స్ కి వెళుతున్నారు.  కానీ ఈ ఆవేశం ఎంతో సేపు ఉండేలా లేదు. కారణం కరోనా విజృంభణ. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా భీభత్సం మాములుగా లేదు. అందుకే సినిమాల ట్రయిల్ షూట్స్ కూడా ఆపేశారు.

Advertisement
CJ Advs

ఇంతకుముందే తమిళనాడు ప్రభుత్వం సీరియల్స్ షూటింగ్స్‌కి అనుమతులు ఇవ్వడం అక్కడ కూడా షూటింగ్స్ మొదలవడం జరిగింది. కానీ తమిళనాట కరోనా ఎక్కువ అవ్వడంతో చెన్నై తదితర ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ విధించడంతో సీరియల్స్ షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అలాగే హైదరాబాదులోను జరగొచ్చని అంటున్నారు. తెలంగాణ మొత్తం ఒక ఎత్తైతే.. ఒక్క హైదరాబాద్ ఒక ఎత్తు అన్నట్టుగా కరోనా విజృంభణ ఉంది. మరి ఇలాంటి సమయంలో షూటింగ్స్‌కి అనుమతులు వచ్చినా.... కరోనా కారణముగా వాయిదా పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరిగిపోతుంది. దానితో మళ్లీ హైదరాబాద్‌లో అన్ని స్టేట్స్ వలె కేసీఆర్ కూడా లాక్ డౌన్ విధించినా విధించవచ్చు. అందుకే ఎంతగా ఆవేశపడినా తర్వాత పని జరుగుతుందా అనేది ప్రస్తుతానికున్న సస్పెన్స్.

Mega serials getting ready for Telicast.. but?:

Serial Stars Happy with Serials Starting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs