Advertisement
Google Ads BL

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సంపత్ నంది ‘సీటీమార్’!


‘సీటీమార్’లో ఆంధ్ర కబడ్డీ టీం కోచ్ గా ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్... తెలంగాణ కబడ్డీ టీం కోచ్ గా మిల్కీ బ్యూటీ తమన్నా

Advertisement
CJ Advs

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. జూన్ 20 సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా ‘సీటీమార్’ చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మించ‌బ‌డుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే...ఈ సంవ‌త్స‌రంలో మొద‌ల‌యిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతుంది.

ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి

డిఓపి: సౌందర్‌ రాజన్‌,

సంగీతం: మణిశర్మ‌,

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,

ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,

సమర్పణ: పవన్‌ కుమార్‌,

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,

కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

Sampath Nandi Birthday Special: SEETIMAARR working Stills released:

Aggressive Star Gopichand As Coach For Andhra Kabaddi Team... Milky Beauty Tamannaah As Coach For Telangana Kabaddi Team In “SEETIMAARR”
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs