Advertisement
Google Ads BL

అబ్బో.. లాక్‌డౌన్‌లో చాలా చేసిందే..!


ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ ముగియడంతో.. హీరోయిన్స్ చాలామంది తమ సినిమాల షూటింగ్స్ కోసం రెడీ అయ్యి ఎయిర్ పోర్ట్ లో తేలారు. తాజాగా రకుల్ ప్రీత్ కూడా తన బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబై నుండి ఢిల్లీకి వచ్చినట్టుగా ఎయిర్ పోర్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. అయితే రకుల్ కి అవకాశాలు తగ్గడంతో ఆమె ఎక్కడికి వెళ్లినా రకుల్ మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న తరచూ ఎదురవుతుంది. కానీ రకుల్ ప్రీత్ నాకప్పుడే పెళ్లేమిటి అంటూ దాటేస్తుంది. తాజాగా రకుల్ తల్లి కూడా రకుల్ కి అప్పుడే పెళ్లేమిటి అంటుంది.

Advertisement
CJ Advs

అయితే రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ సమయంలో మూడు నెలల పాటు ఇంటికే పరిమితమై వ్యాయామాలు, కొత్త కొత్త వంటలు నేర్చుకున్నా అని చెప్పడమే కాదు.. కరోనా లాక్ డౌన్ సమయంలో చదువు మీద కూడా దృష్టి పెట్టా అని చెబుతుంది. లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ ఎంబీఏ తరగతులకు హాజరయ్యానని చెప్పింది. ఈ విధంగా వర్కౌట్స్ తోనూ, వంటలతోను, చదువుతోను తాను లాక్ డౌన్ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకున్నానని చెబుతుంది. మరి షూటింగ్స్ అనుమతి రాగానే ఎప్పట్లాగే సినిమా సెట్స్ లో వాలిపోయింది ఈ తార.

Rakul Preet singh Lock down diary out:

Rakul Preet singh studied MBA with Online Classes in Lock down
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs