Advertisement
Google Ads BL

‘క‌వ్వింత’ దర్శకుడి తదుపరి చిత్రమిదే!


‘క‌వ్వింత’ ఫేమ్ విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Advertisement
CJ Advs

ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు తేళ్ల ర‌మేష్ స‌న్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రం ‘క‌వ్వింత‌’తో ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని మాట్లాడుతూ, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాని రూపొందిస్తామ‌న్నారు. ఒక యంగ్ హీరో ఈ సినిమాలో న‌టిస్తార‌నీ, అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో ప‌నిచేస్తామ‌నీ ఆయ‌న చెప్పారు.

నిర్మాత తేళ్ల ర‌మేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివ‌ర‌లో షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ బాగా న‌చ్చింద‌నీ, ‘క‌వ్వింత’ త‌ర్వాత ఇది ఆయ‌న‌కు రెండో సినిమా అనీ చెప్పారు. ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న‌ తెలిపారు.

Kavvintha Movie Director Next Film Confirmed:

Vijay chowdary tripuraneni Director next Film details 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs