Advertisement
Google Ads BL

కియారా ప్లేస్ లో కీర్తి సురేష్..?


సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అంతే కాదు అభిమానుల్లో ఎంతో ఆసక్తిని కూడా కలిగించింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది.

Advertisement
CJ Advs

మొదట్లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు చిత్రబృందం కియారాని సంప్రదించిందట. కానీ డేట్స్ కుదరకపోవడంతో సర్కారు వారి పాటలో మహేష్ సరసన నటించే అవకాశాన్ని వదులుకుందట. అయితే తాజగా కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందని సమాచారం. 

ఇప్పటికైతే ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. కానీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లే అని అంటున్నారు. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జీ ఎమ్ బీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Keerthy accepted for it..?:

Inplace of Kiara, keerthy accepted it
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs