Advertisement
Google Ads BL

ఓటీటీ రిలీజ్..అందరి కళ్ళు ఆ సినిమాపైనే..!


కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతబడిపోవడంతో నిర్మాతలు ఓటీటీ వేదికగా తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటికే తెలుగులో అమృతరామమ్, తమిళంలో పొన్మగల్ వంధాల్, హిందీలో చాలా చిత్రాలు డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అయితే చాలా వరకూ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన చిత్రాలకి సరైన స్పందన లభించలేదు. అవన్నీ చిన్న సినిమాలు కావడం వల్లో, లేక కంటెంట్ లో ప్రాబ్లమో అర్థం కావడం లేదు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఒక సినిమాపై అందరి దృష్టి పడింది. థియేటర్ల తెరుచుకునే వరకు వెయిట్ చేయకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవబోతున్న ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంది. మహానటి ద్వారా పాపులర్ అయిన కీర్తి సురేష్ నటిస్తున్న పెంగ్విన్ చిత్రం డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. రేపటి నుండి స్ట్రీమింగ్ అవనున్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి సక్సెస్ అయ్యిందంటే మరిన్ని చిత్రాలు ఓటీటీ బాట పట్టే అవకాశం ఉంది. మరి రేపేమవుతుందో చూడాలి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని కార్తిక్ సుబ్బరాజ్ నిర్మించగా, ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించాడు.

All eyes are on that lady oriented movie..:

All eyes are on that lady oriented movie..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs