Advertisement
Google Ads BL

‘పలాస’ హీరో రక్షిత్ కొత్త సినిమా ‘WHO’


కరోనా నేపథ్యంలో ‘పలాస’ హీరో రక్షిత్ కొత్త సినిమా ‘WHO’

Advertisement
CJ Advs

‘పలాస 1978’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ‘‘WHO’’ (World Hazard Ordinance) అనే టైటిల్ ఖరారు చేశారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్‌లో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది. 

హీరో రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కి మంచి స్పందన లభిస్తుంది. ‘I’m gonna tell god everything’ వంటి వైవిధ్య మైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తారు. 

Palasa 1978 Hero New Movie Title Announced :

Palasa 1978 Hero Rakshit new Movie WHO
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs