Advertisement
Google Ads BL

బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్..!


కరోనా లాక్‌డౌన్ వలన వెండితెర షూటింగ్స్, బుల్లితెర షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. సీరియల్స్, సినిమాలు, స్పెషల్ షోస్ అన్ని ఆగాయి. అయితే తాజాగా ప్రభుత్వం నుండి షూటింగ్స్ ని అనుమతులు లభించడంతో... ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ లంతా మెల్లిగా మేకప్ లకు రెడీ అవడమే కాదు.... షూటింగ్ స్పాట్స్ కి వెళ్లిపోయారు. సినిమా వాళ్ళు ఒక్కొక్కరిగా రెడీ అవుతున్నారు. అయితే తాజాగా బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే కామెడీ షో జబర్దస్త్ కూడా మొదలు కాబోతుంది. నిన్నటివరకు లాక్ డౌన్ వలన జబర్దస్త్ షో షూట్ కూడా ఆగిపోయింది.

Advertisement
CJ Advs

ఇక రెండు నెలలనుండి జబర్దస్త్ పాత ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేస్తున్నారు మల్లెమాల టివి వారు. తాజాగా జబర్దస్ షూటింగ్ కూడా మొదలైపోయింది. అనసూయ, రష్మీ యాంకర్స్ గా రోజా జడ్జ్ గా జబర్దస్త్ షూట్ కమెడియన్స్ తో మొదలైంది. నిన్నటి నుండి నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జబర్దస్త్ షో షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దానితో కామెడీ ప్రేమికులు ఊపిరిపీల్చుకుంటున్నారు. వారం వారం పాత స్కిట్స్ చూడలేక బోర్ కొట్టిన వారు మళ్లీ జబర్దస్త్ మొదలవుతుంది అనగానే కొత్త ఉత్సాహంతో ఆ షో కోసం వెయిట్ చేస్తున్నారు.

Good News Small Screen Audience :

Jabardasth Show Shooting Started after lockdown
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs