Advertisement
Google Ads BL

డైరెక్టర్‌పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్!


మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఓ టాప్ దర్శకుడిని, హీరోని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు సదరు హీరోని పక్కనబెట్టి మరోసారి ఆ సీక్రెట్ దర్శకుడిని ఓ ఆట ఆడుకుంది. పూనమ్ కౌర్ ఏ దర్శకుడ్ని ఉద్దేశించి ట్వీట్స్ వేస్తుందో అందరికి తెలుసు. కానీ ఆపేరే బయటికి రాదు. తాజాగా సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యతో మరోసారి పూనమ్ కౌర్ ఆ దర్శకుడిని టార్గెట్ చేసింది. తాను చాలా రోజుల నుండి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా అని.. దానికోసం నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని.. అయితే మానసిక వ్యాధితో బాధపడేటప్పుడు ఓ దర్శకుడిని ఫోన్ చేసి మానసిక వ్యాధిని అధిగమించాలంటే ఏం చెయ్యాలో ఓ సలహా ఇమ్మని అడిగాను అని చెబుతుంది.

Advertisement
CJ Advs

అయితే సదరు దర్శకుడు తనని సినిమాల నుండి తప్పించడమే కాకుండా, తనకి అవకాశాలు లేకుండా చేసాడని, అలాగే తనని ఏ ఈవెంట్ కి రాకుండా అడ్డుకున్నాడని, అయితే తాను సలహా అడిగినప్పుడు మాత్రం  నువ్వు ఆత్మహత్య చేసుకుంటే కేవలం ఒక్క రోజు వార్తలా మిగిలిపోతావని.. అంతేకాని.. ఇంకేం జరగదని చెప్పాడని అంటుంది. ఆ దర్శకుడి వలన చాలా మానసిక వేదన అనుభవించా అని.. స్టేజ్ ఎక్కి.. అందరి గురించి కవిత రూపంలో అందరిని పొగుడుతూ ఉపన్యాసాలు ఇస్తాడని.. నువ్వు గురుజీవి కాదని నీ లాభం కోసం నువ్వు నీ స్నేహితులని కూడా మభ్యపెడుతున్నావు అని.. నా మీద నెగెటివ్ ఆర్టికల్స్ రాయించినా నేను మానసికంగా బలంగా మారానని..అంతేకాని ఆత్మహత్య చేసుకోలేదని చెబుతుంది. మరి పూనమ్ కౌర్ మరొక్కసారి ఆ దర్శకుడిని ఇష్టం వచ్చినట్టుగా ఆడేసుకుంది. పూనమ్ ట్వీట్స్‌తో ఆ దర్శకుడి పరిస్థితి ఎలా ఉందొ మరి.

Poonam Kaur sensational comments on Tollywood Director:

Poonam Kaur Targets Tollywood Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs