Advertisement
Google Ads BL

రీ రికార్డింగ్ దశలో ‘క్లూ’!


నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అలా కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న చాలా చిత్రాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ చేయాలా లేక ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించాలా అన్న సందిగ్ధం అలాగే ఉన్నప్పటికీ ముందు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి అనే లక్ష్యంతో చాలామంది నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. అలా తమ తొలి ప్రయత్నం తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొనే ప్రయత్నంలో ఉంది నూతన చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్ అండ్ ఎం క్రియేషన్స్’.

Advertisement
CJ Advs

దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన కార్పొరేట్ కంపెనీ ‘యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ సమర్పణలో ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ నిర్మించిన తొలి చిత్రం ‘క్లూ’ షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. గతంలో రియల్ స్టార్ శ్రీహరి నటించిన పలు చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో, స్టోరీ డిపార్ట్మెంట్‌లో పని చేయడంతో పాటు తెలుగు, తమిళ ఉభయ భాషా దర్శకుడు భారతీ గణేష్ వద్ద కో - డైరెక్టర్ గా చేసిన రమేష్ రాణాను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన నిర్మాతలు సుభాని అబ్దుల్ అండ్ బ్రదర్స్ నిర్మించిన యాక్షన్ సస్పెన్స్ అండ్ ట్రెజర్ హంట్ థ్రిల్లర్ ‘క్లూ’ ప్రస్తుతం రీరికార్డింగ్ దశలో ఉంది. “కాలగర్భంలో మరుగున పడిన కొన్ని వందల సంవత్సరాల నాటి గుప్త నిధి తాలూకు రహస్యాన్ని చేధించి ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలని ప్రయత్నించే ఒక సిన్సియర్ ఆఫీసర్‌కు అతని బృందానికి ఎదురైన అనుభవాలు, అద్భుతాల సమాహారమే ‘క్లూ’ కథాంశం. ఇందులో అద్భుత సాహసాలు, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, థ్రిల్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్ళలో ఉంటాయి అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. యువ సంగీత సంచలనం ‘ర్యాప్ రాక్ షకీల్’ సంగీత సారథ్యంలో రామజోగయ్యశాస్త్రి, భాషా శ్రీ, విష్ణు, అప్సర్ హుస్సేన్ రచించిన నాలుగు పాటల ఆడియో మా చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. బిగ్ బాస్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నేహా హనీ, గీతామాధురిలతో పాటు చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ ఈ పాటలను పాడారు. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కు రీ రికార్డింగ్ చాలా ముఖ్యం కాబట్టి మా మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ చాలా శ్రద్ధ తీసుకొని అద్భుతమైన ఆర్.ఆర్. సమకూర్చారు’’ అని తెలియజేశారు దర్శకుడు రమేష్ రాణా.

ఇక మేకింగ్ విశేషాలను తెలియజేస్తూ “కథాపరంగా ఇది డిఫరెంట్ లోకేషన్స్‌లో చిత్రీకరించాల్సి ఉండటంతో హైదరాబాద్, గోవా, కేరళ, విశాఖపట్నం లొకేషన్స్‌లో భారీ స్థాయిలో షూట్ చేశాం. అలాగే సబ్జెక్ట్ డిమాండ్ మేరకు ఇందులో గ్రాఫిక్స్ కు మంచి అవకాశం ఉండటంతో దీన్నొక గ్రాఫికల్ వండర్ గా తీర్చిదిద్దారు మా దర్శకుడు రమేష్ రాణా. ‘క్లూ’ టైటిల్ కింద ‘ద జర్నీ బిగిన్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేస్తాం. అలాగే ఈ చిత్రం ఆడియో ఒక ప్రముఖ ఆడియో సంస్థ ద్వారా విడుదల కానుంది. కరోనా పరిస్థితులను సమీక్షించుకుని త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాం’’ అని తెలియజేశారు నిర్మాత సుభాని అబ్దుల్.

ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ చిత్రం ద్వారా పృద్వి శేఖర్ అనే యంగ్ ఫైట్ మాస్టర్ హీరోగా పరిచయం అవుతుండగా సబీనా జాస్మిన్, శుభాంగి పంత్, సంజన నాయుడు, ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఒక కీలక పాత్ర పోషిస్తుండగా మగధీర ఫేమ్ దేవ గిల్, షియాజీ షిండే, జీవా, మధు నారాయణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఇక ఈ చిత్రానికి డైలాగ్స్: భాషా శ్రీ, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, సినిమాటోగ్రఫీ: మురళి కృష్ణ, ఎస్. శ్రీనివాస్, ఫైట్స్: కింగ్ ఫ్యూ శేఖర్, షావాలిన్ మల్లేష్, పబ్లిసిటీ డిజైనర్: మల్లి రాజు, ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్: మధు నారాయణన్, నిర్మాత: సుభాని అబ్దుల్ అండ్ బ్రదర్స్, కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రమేష్ రాణా.

S and M Creations ‘Clue’ in Re Recording Stage:

S and M Creations ‘Clue’ Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs