Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ ని ఇబ్బంది పెడుతున్న శృతి హాసన్..?


పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అన్నీ సవ్యంగా కుదిరితే ఈ పాటికే ఈ సినిమా థియేటర్లలో రిలీజై ఉండేది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడి రిలీజ్ ఆలస్యమవుతుంది.

Advertisement
CJ Advs

అయితే తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకి అనుమతులు లభించిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో వకీల్ సాబ్ చిత్రీకరణ స్టార్ట్ కానుందట. ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఒకానొక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ పాత్రకోసం ఆమె చాలా డిమాండ్ చేస్తుందట. కేవలం పదిరోజుల షూటింగ్ కి మాత్రమే రానున్న శృతి, 70లక్షలకి పైగా డిమాండ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అసలే కరోనా వల్ల నిర్మాతలకి తీవ్ర నష్టం వాటిల్లుతున్న ప్రస్తుత సమయంలో శృతి హాసన్ అంతలా డిమాండ్  చేయడం ఇబ్బందిగా మారిందని టాక్.

అయితే ఏది ఏమైనా ఈ సినిమా చిత్రీకరణని పూర్తి చేయాలని భావిస్తున్నారట. అందుకే శృతి హాసన్ అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.  వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Shruti hasan demands huge for Vakeel saab..?:

Shruti hasan demands huge for Vakeel saab..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs