Advertisement
Google Ads BL

పిల్లలు మా పర్సనల్ విషయం: ఉపాసన!


ఎన్టీఆర్, బన్నీ పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ గడిపేస్తున్నారు. వీరితో పాటే పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ - ఉపాసన జంట మాత్రం ఇంకా పిల్లలని కనలేదు. వాళ్ళు తాజాగా ఎనిమిదో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు పిల్లలని కనకపోవడానికి ఉపాసన తనదైన స్టయిల్లో సమాధానం చెప్పింది. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా. కానీ రామ్ చరణ్ - ఉపాసనలు మాత్రం పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేరట. అదే విషయం ఉపాసన చెబుతుంది. పిల్లలు కనాలనేది మా పర్సనల్ విషయం. అయినా మేము పిల్లలని కనకపోవడానికి కారణం ఉంది అంటుంది.

Advertisement
CJ Advs

పెళ్లి తర్వాత గర్భం దాల్చడం అనేది నా పర్సనల్. మాకు ఇప్పట్లో పిల్లలు వద్దనుకున్నాం. అయినా ప్రెగ్నెన్సీ విషయంలో నాకు కొన్ని భయాలున్నాయి. నేను ఇప్పుడిప్పుడే బరువు తగ్గుతున్నాను. పిల్లలని ఎప్పుడు కనాలనే విషయంలో మాకు క్లారిటీ ఉంది. ఇక రామ్ చరణ్ కి కొన్ని గోల్స్ ఉన్నాయి. మెగా అభిమానులని అలరించే విషయంలో నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఒకవేళ పిల్లల్ని కనేస్తే పిల్లలు నా గోల్స్ విషయంలో అడ్డుగా అనిపిస్తే అది నేను తట్టుకోలేను అందుకే చరణ్ కూడా ఇప్పుడప్పుడే పిల్లల్ని వద్దనుకుంటున్నాడు అని చెబుతుంది మెగా కోడలు ఉపాసన. అయినా పిల్లలు అనేది వారి పర్సనల్ అయినా.. పిల్లలు పుడితే గోల్స్ సాధించడం కష్టమనుకుంటే... పిల్లల్ని కన్నవాళ్ళు గోల్స్ సాధించడం లేదనా దానర్ధం. ఏమో అది రామ్ చరణ్ దంపతులకే తెలియాలి మరి. 

Why Ram Charan and Upasana not having kids?:

That’s Why Charan, Upasna Not Having Kids
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs