Advertisement
Google Ads BL

జక్కన్నని మోసం చేశాడంటున్నారు!


తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజమౌళిని మోసం చేశాడా? ప్రస్తుతం RRR పనులతో బిజీగా వున్నాడు. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ కి వెల్దామా అని కాచుకుని కూర్చున్నాడు. లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ కి అనుమతులొచ్చినా.. RRR లాంటి బిగ్ ప్రాజెక్ట్ ని సామాజిక దూరం పాటిస్తూ షూట్ చెయ్యడం అసాధ్యమే. అయితే రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ విషయంలో జక్కన్నను ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోసం చేశాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జక్కన్నకి మహాభారతం సినిమా చెయ్యాలనేది కల. అయితే అది RRR తర్వాత కావొచ్చు, లేదా రాజమౌళి చివరి చిత్రమైనా కావొచ్చు. అయితే రాజమౌళి సినిమాలకి ఇప్పటివరకు కథని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే అందిస్తున్నాడు. అయితే ఈ మహాభారతం సినిమాని అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కించే ప్లాన్ కూడా ఎప్పుడో మొదలయ్యింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా అమీర్ ఖాన్ మహాభారతానికి కథ అందించనున్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కే మహాభారతానికి స్క్రిప్ట్ రాసేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పి షాకిచ్చాడు. అయితే మహాభారతంని వెబ్ సీరీస్ గా అయినా, సినిమాగా అయినా మలిచేందుకు అమీర్ ఖాన్ మహాభారతం మీద రీసెర్చ్ కూడా చేసాడు. అందుకే అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ని మహాభారతం స్క్రిప్ట్ ఇవ్వమని కోరినట్టుగా.. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం అమీర్ తో మహాభారతం స్క్రిప్ట్ చర్చల్లో ఉన్నట్టుగా చెబుతుండడం చూస్తే రాజమౌళికి ఆయన తండ్రిగారు హ్యాండ్ ఇచ్చి.. అమీర్ కోసం పనిచేస్తాడనిపిస్తుంది. అయితే అమీర్ ఖాన్ ది సీరీస్. రాజమౌళిది సినిమా. ఎవరి స్టయిల్ వాళ్ళది. అయినా మహాభారతం ఎవరికీ ఇష్టం వచ్చిన స్టయిల్లో వారు ప్రెజెంట్ చేస్తారు. ఎన్ని రకాలుగా అయినా అది తెరకెక్కించొచ్చు. అందుకే రాజమౌళికి మరో వెర్షన్ రాసే ప్లాన్‌లోనే అమీర్ ఖాన్ కి మహాభారతం స్క్రిప్ట్ కోసం రెడీ అని విజయేంద్రప్రసాద్ అంటున్నారు.

Will Vijayendra Prasad Choose Khan Over Rajamouli?:

Aamir Khan revives Mahabharat plans with Vijayendra Prasad 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs