Advertisement
Google Ads BL

విరాట పర్వం కోసం ట్రైనింగ్ తీసుకున్న ప్రియమణి..


రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నీది నాది ఒకే కథ సినిమా ద్వారా సెన్సిబుల్ టాపిక్ ని చాలా హృద్యంగా చూపించిన వేణు, ఈ సారి తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్ కాలం నాటి కథని తీసుకున్నాడు. 1990 ప్రాంతంలో తెలంగాణలో నక్సలిజం బాగా ఉండేది.

Advertisement
CJ Advs

అప్పటి కథని తీసుకుని ఎమోషనల్ గా చెప్పడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన మూడు పోస్టర్లకి విశేష స్పందన లభించింది. పోస్టర్ల ద్వారానే స్టోరీ థీమ్ ని ఎలివేట్ చేసిన వేణు, ఈ సినిమాలో ఒకానొక కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ప్రియమణిని తీసుకున్నాడు. ఈ సినిమాలో ఆమె నక్సలైట్ భారతక్కగా కనిపించనుంది  అయితే ఈ సినిమాలోని నక్సలైటు పాత్రలో నటించడానికి ఆమె కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా తీసుకుందని సమాచారం.

మాజీ నక్సలైట్ దగ్గర అప్పటి కాలం నాటి పరిస్థితులు, అడవుల్లో వారి జీవన విధానం, తదితర సంబంధిత విషయాలని బాగా తెలుసుకుందట. అవన్నీ ఆ పాత్రకి బాగా హెల్ప్ అయ్యాయట. మొత్తానికి పాత్ర కోసం కొన్ని రోజులు శిక్షణ కుడా తీసుకుందంటే, విరాట పర్వంలో ప్రియమణి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని అర్థం అవుతుంది.

Priyamani went for training about naxal role..:

Priyamani went for training about naxal role in Virataparvam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs