Advertisement
Google Ads BL

‘భానుమతి రామకృష్ణ’ వరల్డ్ ప్రీమియర్ ఎప్పుడంటే?


ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. భిన్న మనస్తత్వాలు కలిగి, ముప్పయేళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథనంతో సాగే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు చూపించిన అద్భుతమైన విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ,ప్రముఖ యువ దర్శకుడు రవికాంత్ పెరెపు ఎడిట్ చేశారు.

Advertisement
CJ Advs

ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ‘భానుమతి రామకృష్ణ’ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఒక అందమైన ప్రేమకథను చూస్తున్నట్లు అనిపించింది. 30 ఏళ్ళ వయసులో ఉన్న పరిణితి చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమ కథను చూడటం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలు మనం తరచుగా చూడనిది. మొదటిసారిగా ఈ చిత్రం ఆహలో విడుదల అవుతుందని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. యశ్వంత్ ములుకుట్లకు చెందిన క్రిషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కు చెందిన శరత్ మరార్ సమర్పించారు.

World Premiere of Bhanumathi Ramakrishna on July 3:

Bhanumathi Ramakrishna Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs