Advertisement
Google Ads BL

మహేష్, విజయ్ కాంబో‌పై సుహాసిని ఏమందంటే?


గతంలో సూపర్ స్టార్ మహేష్ - ఇళయదళపతి విజయ్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతుంది అని.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మహేష్ - విజయ్ క్రేజ్ కి తగ్గట్టుగా ఓ భారీ స్క్రిప్ట్ తో మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారనే ప్రచారం జరగడమే కాదు.. మహేష్ - విజయ్ లు ఈ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అన్నారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మహేష్ కానీ, విజయ్ కానీ ఆ సినిమాపై ఎక్కడా పెదవి విప్పలేదు. అయితే తాజాగా మహేష్ - విజయ్ బడా మల్టీస్టారర్ ఆగిపోవడానికి ఓ కారణముంది అని దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని చెబుతుంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ని విక్రమ్, కార్తీ, జయం రవిలతో పాటు మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి పేరున్న నటులతో తెరకెక్కిస్తున్నాడు. గతంలో మహేష్ - విజయ్ లతో మణి సర్ చెయ్యాలనుకున్న సినిమా మణి డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సినిమానే. అయితే వాళ్లిద్దరూ ఆ సినిమా అప్పట్లో చేయకపోవడానికి కారణం మాత్రం నాలుగేళ్ళ క్రితం ఈ భారీ పీరియడ్ డ్రామాకు దర్శకుడు మణిరత్నం ఆలోచనలకు తగ్గట్టుగా వి ఎఫ్ ఎక్స్ వర్క్ చేసే టీమ్ దొరకలేదట. అందుకే మణిరత్నం అప్పట్లో మహేష్, విజయ్ లతో పొన్నియిన్ సెల్వన్ చేద్దామనుకున్న ఆలోచన విరమించుకున్నాడట. మరి అప్పుడు కనుక మణి ఆ సినిమాని తెరకెక్కించినట్టైతే ఆ సినిమా తెలుగు, తమిళ బాక్సాఫీసులని షేక్ చేసి పారేసేది. 

Suhasini talks about Mahesh Babu and Vijay combo :

Suhasini Revealed the secret about Mahesh Babu and Vijay Combo Drop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs