Advertisement
Google Ads BL

తలసాని తనయుడు వదిలిన ‘జె మీడియా 361 డిగ్రీస్’ లోగో


అత్యాధునిక హంగులతో పాటు.. డిస్ ఇన్ఫెక్టెడ్ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టింది జె మీడియా. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ని కొత్త పుంతలు తొక్కించి ఎల్‌ఈడి స్ర్కీన్స్ ని ప్రజెంట్ చేయడంలో నెంబర్ వన్ అనిపించుకున్న జె మీడియా అధినేత నరేంద్ర మరో అత్యాధునిక స్టూడియో నిర్మాణానికి ముందడుగు వేసాడు. జె మీడియా 361 డిగ్రీస్ పేరుతో నిర్మించబోయే ఈ స్టూడియో ప్రపంచలోనే మొదటి డిస్ ఇన్ఫెక్టెడ్ స్టూడియోగా చరిత్రలో నిలవబోతుంది. హైదరాబాద్ సమీపంలోని గోపన్నపల్లిలో ఈవెంట్స్ కి, సినిమా షూటింగ్స్ అనువుగా ఉండే స్టూడియో నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతుంది. కంప్లీట్ సెటెప్ తో ప్రతీ ఎక్విప్మెంట్ ని స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతూ.. సౌండ్, లైటింగ్ వంటి డిపార్ట్ మెంట్ లలో అత్యాధునిక టెక్నాలిజీతో స్టూడియో నిర్మాణం కాబోతుంది. వీటితో పాటు టాప్ క్లాస్ సూట్ రూమ్స్, లాంజ్ లు, పూల్ ఏరియా నిర్మాణం కూడా వీటిలో భాగం అవుతుంది.

Advertisement
CJ Advs

గోపన్నపల్లిలో లక్షా ముప్పై ఐదు వేల చదరపు అడుగలలో నిర్మాణం అయ్యే ఈ స్టూడియో హైఎండ్ టెక్నాలిజీ తో సినిమా రంగంలో కొత్త ఒరవడి సృష్టించబోతుంది. ఈ స్టూడియో  లోగోని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు, టీఆర్ఎస్ లీడర్ తలసాని సాయికిరణ్ లాంచ్ చేసారు. ఈ లోగో మరియు ఈ ప్రాజెక్ట్ ఐడియా చాలా బాగా నచ్చాయనీ, నరేందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే ఈ స్టూడియో నిర్మాణం ప్రారంభం కాబోతుంది.

Talasani Saikiran Launches J Media 361 Degrees Logo:

J Media 361 Degrees Logo released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs