Advertisement
Google Ads BL

బాలయ్య భారీగా గర్జిస్తున్నాడు..!


10మిలియ‌న్స్ వ్యూస్ క్రాస్ చేసిన న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుల BB3 First Roar

Advertisement
CJ Advs

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ BB3. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా BB3 First Roar పేరుతో విడుద‌ల‌చేసిన టీజ‌ర్ ఇప్ప‌టికే 10 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ని క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం.1 ట్రెండింగ్‌లో ఉంది.

ఈ సంద‌ర్భంగా న‌ట‌సింహ బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ‘‘BB3 టీజ‌ర్ అదిరిపోయింది అంటున్నారు అంద‌రూ..సినిమా కూడా అంత పెద్ద రేంజ్‌లో ఉంటుంది. ‘సింహా’, ‘లెజెండ్’ త‌ర్వాత నేను బోయ‌పాటి చేస్తోన్న మ‌రో సూప‌ర్‌ సెన్సేష‌న‌ల్ మూవీ ఇది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చాలా పెద్ద స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్స్ మ‌ళ్ళీ స్టార్ట్ అయ్యాక ఈ సినిమాను రెట్టింపు వేగంతో పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.

బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులు, నంద‌మూరి అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రేంజ్ లో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలం తో పాటుగా చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘BB3’ సాంకేతిక వ‌ర్గం సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: థమన్‌ ఎస్‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

10 Million plus Views to BB3 First Roar :

BB3 First Roar gets 10 MIllion Plus Views  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs