Advertisement
Google Ads BL

సునీల్‌కి షాకిచ్చిన బాలయ్య డైరెక్టర్!


సునీల్ హీరో వేషాలు తగ్గాక మళ్ళీ కేరెక్టర్ ఆర్టిస్ట్ గానో, లేదంటే కమెడియన్‌గానో మారి మళ్ళీ బిజీ అవుదామనుకుంటూ.. ఆశలు పెంచుకున్నాడు. కానీ సునీల్ కి అడుగడుగునా అవాంతరాలు. కమెడియన్‌గా కాదు, కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను సునీల్ కి మళ్ళీ సక్సెస్ దక్కలేదు. కనీసం త్రివిక్రమ్ కూడా సునీల్ కి మంచి కేరెక్టర్స్‌ని ఇవ్వలేకపొతున్నాడు. అయితే విలన్‌గా అయినా సునీల్ ఆకట్టుకుంటాడు అనుకుంటే రవితేజ డిస్కో రాజా రిజల్ట్‌తో భారీ షాక్. తాజాగా బోయపాటి - బాలకృష్ణ సినిమాలో సునీల్‌కి విలన్ కేరెక్టర్ అంటూ ప్రచారం జరగడంతో బాలయ్య ఫ్యాన్స్‌ లో ఆందోళన. బాలయ్య ముందు కామెడీకి కూడా పనికిరాని సునీల్ బాలయ్య ముందు విలన్ గానా అంటూ తెగ వర్రీ అవుతున్నారు.

Advertisement
CJ Advs

ఒకప్పుడు హీరోలను విలన్స్ గా మలచిన బోయపాటి ఇప్పుడు కమెడియన్ ని విలన్ గా మార్చడం ఏంట్రా బాబు అంటూ నందమూరి ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. అయితే సునీల్ ని బోయపాటి, బాలయ్య సినిమా కోసం సంప్రదించాడట కానీ విలన్ రోల్ కోసం కాదట... బాలయ్య పక్కన ఉండే కామెడీ రోల్ కోసమట. అయితే తాజాగా సునీల్ కి బోయపాటి భారీ షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. బాలయ్య - బోయపాటి సినిమాకి కరోనా లాక్‌డౌన్‌కు ముందుగానే షూటింగ్ కొన్ని రోజులు జరిగింది. అయితే రెండున్నర నెలలు అనుకోకుండా బ్రేక్ రావడంతో బోయపాటి స్క్రిప్ట్ మరోసారి చూసుకున్నాడు. ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి ఇష్టపడే బోయపాటి.. ఆ మార్పుల్లో భాగంగానే సునీల్ కామెడీ ట్రాక్ మొత్తం ఎత్తేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం బడ్జెట్ కంట్రోల్ అంటున్నారు. ఇప్పుడు ఇలా సునీల్ లాంటి కేరెక్టర్స్ తో కాలయాపన చేసేకన్నా ఆ కేరెక్టర్ తీసెయడం మేలు అని అనుకున్నాడట బోయపాటి. ఇక సినిమాలో సునీల్ ట్రాక్ లేకపోయినా కూడా కథలో పెద్దగా మార్పులు కనిపించకపోవడంతో సునీల్ సీక్వెన్స్ అంతా తీసేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

Boyapati Srinu Gives shock to Comedian Sunil:

Sunil role out in BB 3 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs