దేశమంతా కరోనా కారణంగా తీవ్ర అవస్థలు పడుతోంది. సంపూర్ణ లాక్డౌన్ ని ప్రయోగించినపుడు అదుపులోనే ఉన్న కరోనా, సడలింపులు ఇవ్వగానే తన పంజా విసిరింది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. అయితే కరోనా లాక్డౌన్ టైమ్ ని ముంబైలో గడిపిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హైదరాబాద్ కి వచ్చేసిందని వార్తలు వస్తున్నాయి.
సడలింపులు మొదలయ్యాక శృతి హాసన్ హైదరాబాద్ కి రావడానికి కారణం ముంబైలో కేసులు పెరగడమే అని చెబుతున్నారు. దేశంలో మూడు లక్షల కేసులు నమోదయితే, కేవలం మహారాష్ట్రలోనే సుమారు లక్ష కేసులు వచ్చాయి. అదీ గాక మరణాలు రేటు కూడా ఎక్కువగానే ఉంది. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి ముంబైలోనే ఒంటరిగా ఏకాంతాన్ని గడుపుతున్నానని చెప్పిన శృతి, సడెన్ గా ముంబైని వీడి బయటకి రావడానికి కారణం కరోనా భయమే అయ్యుంటుందని అంటున్నారు.
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాకి దూరమైన శృతి హాసన్, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.