Advertisement
Google Ads BL

నా కూతుర్ని షూటింగ్‌కు పంపనంటే పంపను!


ఇది ఓ బాలీవుడ్ హీరోయిన్ తండ్రి మాట. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ముగుస్తుండడంతో.. సినిమా షూటింగ్స్ కి అనుమతులు లభించడంతో.. నటులంతా తమ సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ కోసం సన్నద్ధం అవుతున్నారు. హీరోయిన్స్, హీరోలైతే సినిమా షూటింగ్స్ కోసం దేశాన్ని దాటాకపోయినా... రాష్ట్రాలను దాటాలని ఒళ్ళంతా కప్పుకుని మరీ ఎయిర్ పోర్ట్స్ లో దర్శనమిస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ తండ్రి మాత్రం కరోనా ప్రభావం తగ్గలేదు అందుకే నా కూతుర్ని నేను షూటింగ్ కి పంపాలనుకోవడం లేదు అంటున్నాడు.

Advertisement
CJ Advs

ఆ హీరోయిన్ ఎవరో కాదు సాహో బ్యూటీ శ్రద్దా కపూర్. ప్రస్తుతం శ్రద్ద కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది. అయితే కరోనా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్న శ్రద్దా కపూర్ లాక్ డౌన్ ముగిసి షూటింగ్ కి రెడీ కాబోతుంటే.., శ్రద్ద కపూర్ తండ్రి శక్తి కపూర్ మాత్రం తన కూతుర్ని ఇప్పుడప్పుడే షూటింగ్స్ కి పంపనని చెబుతున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను బయటికి వెళ్లాలనుకోవడం లేదు. అలాగే నా కూతుర్ని కూడా పని మీద బయటికి పంపాలనుకోవడం లేదు. కరోనా ఉదృతి ఇంకా తగ్గలేదు. మున్ముందు మరింత సంక్షోభం ఉండబోతుంది. పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి. ఇప్పుడు షూటింగ్స్ మొదలెడితే.. అంతా తారుమారవుతాయి. మనిషి ప్రాణం కన్నా పని ముఖ్యం కాదు.... ఇప్పుడప్పుడే షూటింగ్స్ మొదలెట్టడం మంచిదికాదని ఇండస్ట్రీలోని నా స్నేహితులకి కూడా చెప్పానంటున్నాడు శ్రద్దా తండ్రి శక్తి కపూర్.

Shakti Kapoor Won’t Allow Daughter Shraddha to Resume Shooting:

Work Is Important But Not At The Cost Of Life says Shakti Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs