Advertisement
Google Ads BL

కొరటాల శివకి లైన్ క్లియర్ అయినట్లే..!


కొరటాల శివకి స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తే మెగా హీరోతో సినిమా బోణి అవుతుంది అనుకుని రామ్ చరణ్ తో సినిమాకి లైన్ క్లియర్ చేసుకుని ముహూర్తం కూడా పెట్టాడు. కానీ ఏమైందో రామ్ చరణ్ కొరటాల శివ సినిమా నుండి తప్పుకుని.. కొరటాలని తండ్రి చిరు ఆచార్యకి తగిలించాడు. రామ్ చరణ్ కాకపోయినా చిరు తగలడంతో కొరటాల హ్యాపీనే. కాకపోతే యంగ్ హీరో స్టార్ హీరో రామ్ చరణ్ అయితే ఇంకా సూపర్. అయితే కొరటాలకి ఇప్పుడు మరో స్టార్ మెగా హీరో దొరకబోతున్నాడట. ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ హిట్‌తో పాన్ ఇండియా లెవల్లో పుష్ప ని సుకుమర్ తో కలిసి చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేసినా.. చెయ్యకపోయినా.. కొరటాలతో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది.

Advertisement
CJ Advs

కొరటాల శివతో బన్నీ కొత్త కలయిక అయినప్పటికీ.. మెగా కాంపౌండ్ లోనే ఏడాది కాలంగా ఉంటున్న కొరటాల శివ బన్నీకి అదిరిపోయే ఓ లైన్ చెప్పాడట. దానితో బన్నీ చేద్దాం సర్ అంటూ కొరటాలకి మాటిచ్చినట్లుగా అది కూడా పాన్ ఇండియా లెవల్ స్క్రిప్ట్ తోనే సినిమాకి దిగుదామని అల్లు అర్జున్ కొరటాలతో గట్టిగా చెప్పినట్టుగా న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కొరటాల శివ పంధాలోనే బలమైన సామాజిక సందేశమున్న కథాంశంతోనే ఈ సినిమా ఉండబోతుంది అని.. దానికి బన్నీ అల్లరిని, కామెడీని జోడించి పాన్ ఇండియా మెచ్చే స్క్రిప్ట్ తోనే కొరటాల - అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది అనే టాక్ నడుస్తుంది.  

Koratala Siva next film with one more Mega Hero:

Koratala Siva next with With stylish Star Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs