Advertisement
Google Ads BL

ఒకే హీరో.. రెండు సినిమాలు.. రెండూ ఓటీటీలోనే..!


మొదట్లో చిన్న చితకా పాత్రల్లో కనిపించిన యాక్టర్ సత్యదేవ్, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతి లక్ష్మీ సినిమా ద్వారా పాపులర్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత వరుసగా నటుడిగా అవకాశాలని అందుపుచ్చుకుని, మెల్లమెల్లగా హీరోగా అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. సత్యదేవ్ హీరోగా నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఆ సినిమాలో సత్యదేవ్ నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.

Advertisement
CJ Advs

అయితే ఒకవైపు నటుడిగా చిన్న పాత్రలు కూడా చేస్తూనే, హీరోగానూ ప్రయత్నిస్తున్నాడు. అయితే సత్యదేవ్ అదృష్టం ఏంటోగానీ హీరోగా చేసిన రెండు సినిమాలు కూడా థియేటర్లో రిలీజ్ కాకుండానే ఓటీటీ విడుదలకి సిద్ధం అవుతున్నాయి. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని వార్తలు వచ్చాయి.

అలాగే గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకుని, థియేటర్లలో విడుదల చేద్దామని వెయిట్ చేసి చేసి చేయలేకపోయిన 47 డేస్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట.  పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దబ్బార శశి భూషణ్, రఘుు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మరికొద్ది రోజులో జీ5 ద్వారా స్ట్రీమింగ్ అవనుందట. ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కావడం సత్యదేవ్ కే మొదటిసారెమో..!

one hero two movies. Two are on OTT..?:

Satyadevs two films on OTT..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs