నిన్న పవన్ కళ్యాణ్ దమ్మున్న నటుడు అంటూ మిల్కి బ్యూటీ తమన్నా హాట్ హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో పవన్ కి జోడిగా నటించిన శృతి హాసన్ పవన్ కళ్యాణ్ ని తెగ పొగిడేస్తోంది. పవన్ గురించి ఏమైనా చెప్పండని శృతి హాసన్‌ని అడగ్గానే ఆయనొక అద్భుతం, మంచి మనసున్న మనిషి అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికెత్తేస్తుంది. ఇక మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అలాగే మీకు పెళ్లైనట్టుగా ప్రచారం కూడా జరిగింది అని అడగగా.. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు.. అంతేకాదు.. నాకు పెళ్లి కూడా కాలేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక గతంలో వకీల్ సాబ్ లో నటిస్తున్నారా అని అడగగా.. లేదు నటించడం లేదు, నన్నెవరూ సంప్రదించలేదు అంది. కానీ వకీల్ సాబ్ యూనిట్ మాత్రం మేము శృతి హాసన్ ని సంప్రదించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం.. కానీ శృతి అలా ఎందుకు చెప్పిందో కనుక్కుంటామన్నారు. కానీ నేడు శృతి హాసన్ ని వకీల్ సాబ్ లో మీరు నటిస్తున్నారా అని అడిగితే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పను అంటూ దాటవేసింది కానీ.. వకీల్ సాబ్‌లో శృతి హాసన్ నటించే విషయం క్లారిటీ ఇవ్వలేదు.