Advertisement
Google Ads BL

‘లూసిఫర్’ రీమేక్‌లో ఆ హీరో అంటున్నారు!


కొరటాలతో చేస్తున్న ‘ఆచార్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ని తెలుగులో సుజిత్ దర్శకత్వంలో రీమేక్ చెయ్యబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ తెలుగు స్క్రిప్ట్‌ని మెగాస్టార్ సలహాలు, సూచనలతో ఇప్పటికే సుజిత్ పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మలయాళం లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ చేసిన పాత్రలో తెలుగులో మెగాస్టార్ కనిపిస్తాడు. అయితే లూసిఫర్‌లో మరో హీరో రోల్ ఉంది. తెలుగులో ఆ రోల్ ఎవరు చేయబోతున్నారో అనే విషయంలో మెగా ఫ్యాన్స్‌లో పిచ్చ ఆసక్తి నెలకొని ఉంది. అయితే చిరు కోసం బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ లూసిఫర్ తెలుగు రీమేక్‌లో పృథ్వీరాజ్ పాత్రలో కనిపించబోతున్నాడని.. ప్రచారం జరగడం చిరు కాదని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా లూసిఫర్ తెలుగు రీమేక్‌లో చిరుతో పాటుగా దగ్గుబాటి హీరో రానా నటించబోతున్నాడని టాక్. మాములుగా రానా కేవలం హీరో కేరెక్టర్స్ మాత్రమే చేస్తా అని మడికట్టుకుని కూర్చోకుండా విలన్ అయినా, నెగెటివ్ కేరెక్టర్ అయినా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినా చేసేస్తాడు. అయినా మలయాళ లూసిఫర్‌లో పృథ్వీరాజ్ పాత్రకి మోహన్ లాల్ పాత్ర అంత వెయిట్ లేకపోయినా.. ఆ పాత్ర ప్రాధాన్యం ఆ పాత్రదే. అందుకే సుజిత్ రానా అయితే బావుంటుంది అని చిరుకి చెప్పగా రానా ఆ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాడు.. వెంటనే సంప్రదించమని చెప్పాడట. దానితో సుజిత్ కూడా రానాకీ ఫోన్ లోనే లూసిఫర్ తెలుగు స్క్రిప్ట్ వినిపించగా.. కథ నచ్చిన రానా అలోచించి చెబుతా అన్నట్టుగా సోషల్ మీడియా టాక్.

Rana Daggubati in Chiru Lucifer Remake:

Rana Daggubati plays Prudhvi Raj Role in Lucifer Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs