కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన చిరంజీవి సర్జా మరణం సినీ అభిమానులని తీవ్రంగా కలచివేసింది. కేవలం 39ఏళ్ల వయస్సులో ఆయన మరణించడం కన్నడ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించడం అందరికీ షాకింగ్ గా ఉంది. అయితే చనిపోయే ముందురోజు రాత్రి ఆయన తన ఫ్రెండ్ తో జరిపిన వాట్సాప్ ఛాటింగ్ బయటకి వచ్చింది.
అందులో చిరంజీవి సర్జా మాట్లాడిన మాటలు విన్నవాళ్లెవరయినా కన్నీళ్ళు పెట్టుకుంటారు. చిరంజీవి సర్జా తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే ఒక వారం రోజులు టూర్ ప్లాన్ చేద్దాం అన్నాడు. అలా అన్న రాత్రే అందరినీ వదిలి వెళ్ళిపోయాడు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటుంటారు. ఆ విషయం ఇలా చిరంజీవి సర్జా జీవితంలో నిజం అవడం బాధాకరం.