Advertisement
Google Ads BL

లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ బన్నీవాసు బర్త్‌డే!


కుటుంబ స‌భ్యుల‌, స‌న్నిహితులు స‌మ‌క్షంలో పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న‌ సూప‌ర్‌హిట్స్‌కి కేరాఫ్ అడ్రాస్ గా మారిన నిర్మాత బ‌న్నీవాసు 

Advertisement
CJ Advs

స్టైలిష్ స్టార్ అల్టు అర్జున్ త‌న మొద‌టి చిత్రం గంగోత్రి త‌రువాత బ‌న్ని కి ఒక స్నేహితుడి గా పరిచ‌యం అయిన ఉద‌య్ శ్రీనివాస్ త‌న ఆర్థిక ప‌రిస్థితుల అప్ అండ్ డౌన్ అవ్వ‌టంతో మ‌ద్య‌లో త‌న చ‌దువు ఆపేసి అల్లు ఫ్యామిలీ స‌పోర్ట్ తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చారు. పాల‌కొల్లులో పుట్టి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుకుని హ‌య్య‌ర్ ఎడ్యూకేష‌న్ అంతా వైజాగ్‌, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పూర్తిచేసారు. చ‌దువు మ‌ధ్య‌లో ఆగిపోయిన‌ప్ప‌డు ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా బ‌న్నీకి ప‌రిచ‌యం అయిన ఉద‌య్ శ్రీనివాస్‌ త‌రువాత వెన‌క్కి చూసుకోలేదు. బ‌న్నికి స్నేహితుడు కావ‌టం ఇండస్ట్రీలో స‌న్నిహితులంద‌రూ బ‌న్నీ వాసు అని పిల‌వ‌టంతో ఉద‌య్ శ్రీనివాస్ బ‌న్నీ వాసుగా ఫేమ‌స‌య్యాడు. వెబ్ మీడియాలో వున్న‌ప్ప‌డు ద‌ర్శ‌కుడు మారుతి ఫ్రెండ్‌. ఆర్య చిత్రంలో బ‌న్నీ వాసు ఓచోట త‌లుక్కుమంటారు. ఆ చిత్రం ఆయ‌న కెరీర్ ని మార్చింద‌నే చెప్పాలి. ఆర్య చిత్రం పాల‌కొల్లు రైట్స్ కోసం వెళ్ళిన బ‌న్నీ వాసుకి నిర్మాత దిల్ రాజు స‌పోర్టు‌తో వెస్ట్ గోదావ‌రి జిల్లాలో మెుట్ట‌మెద‌టిసారిగా డిస్ట్రిబ్యూట‌ర్ గా అవ‌తార‌మెత్తాడు. ఆ త‌రువాత వ‌రుస చిత్రాలు చేస్తూ గుంటూరు జిల్లాలో కూడా సినిమా డిస్ట్రిబ్యూష‌న్ చేసి స‌క్స‌స్ ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్ గా పేరుగాంచారు. ఆ త‌రువాత గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెుట్టమెద‌టి సారిగా యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా 100 పర్సంట్ లవ్ చిత్రంతో నిర్మాత‌గా మార‌ట‌మే కాకుండా త‌రువాత సుప్రీమ్‌హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం విజ‌యంతో సూప‌ర్‌హిట్‌ ప్రొడ్యూస‌ర్ గా క్రేజ్ ని సంపాయించారు. 

ఆ త‌రువాత జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో నాని హీరోగా భలే భలే మగాడివోయ్, అల్లు శిరిష్ హీరోగా శ్రీరస్తు శుభమస్తు, విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గీత గోవిందం, సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ప్రతిరోజూ పండగే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యంగ్ ఎన‌ర్జిటిక్ ప్రొడ్యూస‌ర్ గా బ‌న్నీవాసు త‌న‌కంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం నిర్మాతగా అఖిల్ అక్కినేని హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, కార్తికేయ హీరోగా చావు క‌బురు చ‌ల్లగా మ‌రియు ఎంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా 18 పేజీస్ చిత్రాలు ర‌న్నింగ్ లో వున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ సిట్టింగ్ ద‌శ‌లో వున్నాయి. మోస్ట్ క్రెజియ‌స్ట్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు తన పుట్టిన‌రోజుని కుటుంబ‌స‌భ్యులు మ‌రియు స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రుపుకుంటున్నారు.

Bunny Vas Birthday Celebrations with his Family members and Friends:

Bunny Vas Birthday Celebrations under Lock down conditions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs