Advertisement
Google Ads BL

గోపీ వ‌ద్ద‌న్న‌ది బాల‌య్య‌కు.. బాల‌య్య వ‌ద్ద‌న్న‌ది గోపీకి!


‘రూల‌ర్‌’.. త‌మిళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన మునుప‌టి మూవీ. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయిన ఈ సినిమాలో టోనీ స్టార్క్ (‘ఐర‌న్‌మ్యాన్‌’లో హీరో క్యారెక్ట‌ర్ పేరు) లుక్ ఒక్క‌టే వార్త‌ల్లో నిలిచింది. మిగ‌తా సినిమా అంతా చెత్త అనే పేరు తెచ్చుకుంది. అస‌లు ఈ సినిమా క‌థ బాల‌య్య‌కు ఎలా న‌చ్చింద‌ని ఆయ‌న ఫ్యాన్సే చికాకుప‌డ్డారంటే.. అది ఏ తీరున ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. రూల‌ర్ క‌థ‌ను అందించింది ప‌రుచూరి ముర‌ళి. స్వ‌యానా డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, బాల‌కృష్ణ‌ను ట్రిపుల్ రోల్‌లో చూపిస్తూ ‘అధినాయ‌కుడు’ అనే సినిమాను తీసిన‌ప్ప‌టికీ, ఆ క‌థ‌ను కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో చేయ‌డానికి ముర‌ళి ఇచ్చేశాడు.

Advertisement
CJ Advs

నిజానికి ఆ క‌థ‌ను బాల‌కృష్ణ కోసం ఆయ‌న రాసుకోలేదు. మొద‌ట దాన్ని త‌న ఆంధ్రుడు హీరో గోపీచంద్‌కి చెప్పాడు ముర‌ళి. కానీ ఆ క‌థ గోపీకి న‌చ్చ‌లేదు. సున్నితంగా దాన్ని తిర‌స్క‌రించాడు. దాంతో ఆ స్టోరీని బాల‌య్య‌కు ముర‌ళి వినిపించాడ‌నీ, బాల‌య్య త‌న‌కున్న సెంటిమెంట్ల రీత్యా ఆ క‌థ‌ను కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో చేశాడ‌నీ వినిపిస్తోంది. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో అదివ‌ర‌కు తాను చేసిన ‘జై సింహా’ సినిమా ఓ మోస్త‌రుగానైనా ఆడ‌టంతో, ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే చెయ్యాల‌ని బాల‌య్య ఫిక్స‌వ‌డంతో త‌న క‌థ‌ను ఇచ్చేశాడు ముర‌ళి.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు బాల‌య్య వ‌ద్ద‌న్న క‌థ‌ను గోపీచంద్ చేస్తున్నాడ‌నేది టాక్‌. అది తేజ డైరెక్ష‌న్‌లో రానున్న ‘అలిమేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ‌’. ఈ క‌థ‌ను చాలా కాలం క్రిత‌మే బాల‌య్య‌కు తేజ వినిపించాడంట‌. కానీ ఎందుచేత‌నో అది బాల‌య్య‌కు న‌చ్చ‌లేదు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తేజ డైరెక్ష‌న్‌లో చేయాల‌ని బాలకృష్ణ అనుకోవ‌డం, త‌ర్వాత ఆయ‌న‌ను త‌ప్పించి, ఆ బాధ్య‌త‌ల‌ను క్రిష్‌కు అప్ప‌గించ‌డం చూశాం. అప్పుడు బాల‌య్య వ‌ద్ద‌న్న క‌థ‌ను ఇప్పుడు గోపీతో చేయ‌డానికి రెడీ అవుతున్నాడు తేజ‌. అంటే గోపీకి ‘అలిమేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ’ క‌థ న‌చ్చింద‌న్న మాట‌. ఇందులో హీరోయిన్‌గా ఇంత‌కుముందు అనుష్క‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ పేర్లు వినిపించాయి. కానీ ఆ ఇద్ద‌రూ కాకుండా అలిమేలుమంగ క్యారెక్ట‌ర్‌ను ర‌కుల్ ప్రీత్ చేయ‌నున్న‌ద‌నేది లేటెస్ట్ న్యూస్‌. ఇదివ‌ర‌కు గోపీ, ర‌కుల్ జంట‌గా న‌టించిన ‘లౌక్యం’ చిత్రం సూప‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు తేజ ఆ ఇద్ద‌రినీ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

Balakrishna and Gopichand Exchanged Their Movie Stories:

Balayya movie to Gopichand and Gopichand movie to Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs