Advertisement
Google Ads BL

బాలయ్య అన్ని మాటలన్నా.. చిరు గొప్పతనం ఇదే!


బాలకృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీలో సెగలు రాజేసి.. కామ్ గా పుట్టిన రోజు, షష్ఠిపూర్తి అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. చిరుని డైరెక్ట్ గానే కామెంట్స్ చేస్తూ.. మధ్య మధ్యలో ఇండస్ట్రీ పెద్దలని కూడా ఈ విషయంలోకి లాగుతున్నాడు. చిరు - బాలయ్య సన్నిహితులే. మంచిగా కలిసి ఉంటారు. నాగార్జున, వెంకటేష్ కి బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ చిరుతో బాలయ్య సన్నిహితంగా మెలుగుతాడు. బాలయ్య ఏం మాట్లాడినా బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని చిరు సరిపెట్టుకుంటాడు. తాజాగా బాలయ్య తనని డైరెక్ట్ గానే ఎన్నిమాటలన్నప్పటికీ... చిరు మాత్రం అవేం మనసులో పెట్టుకోలేదనిపిస్తుంది.

Advertisement
CJ Advs

అందుకే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చిరు బాలకృష్ణకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పాడు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు, ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో, ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని..... ట్విట్టర్ వేదికగా చిరంజీవి, బాలకృష్ణకు ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. మరి బాలకృష్ణ మీడియా ముఖంగా చిరుని 80 ఏళ్ళ పార్టీకి పిలవలేదు, మా ఈవెంట్ కి దూరం పెట్టారు అంటూ చిరుని టార్గెట్ చేసినప్పటికీ.. చిరు మాత్రం సింపుల్ గా మన బాలయ్యకి అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ చూశారా.. మా హీరో గొప్పదనం మీరేమన్నా మేం పట్టించుకోము.. అంటూ సోషల్ మీడియాలో నందమూరి అభిమానులకి కౌంటర్ వేస్తున్నారు.

Chiranjeevi Birthday Greetings to Balakrishna:

Chiranjeevi Birthday wishes to Nandamuri Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs