Advertisement
Google Ads BL

టీజర్‌లో బాలయ్య పంచ్ కొడాలి నానిపైనేనా?


బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అంటే తలలు తెగాల్సిందే... కాళ్ళు చేతులు నరకాల్సిందే. పవర్ ఫుల్ డైలాగ్స్ తో శత్రువులలో వణుకు పుట్టాల్సిందే. బాలయ్య ఎదురొస్తే.. శత్రువులకు బేజారే. మరి బోయపాటితో బాలయ్య సింహ, లెజెండ్ సినిమాలు రెండూ రెండే. మాస్ హిట్స్. బాలయ్యని ఎంత పవర్ ఫుల్ గా చూపించాలో అంత పవర్ ఫుల్ గా బోయపాటి ఒక్కడే చూపించగలడా అనేలా సింహాలో బాలయ్య కేరెక్టర్, లెజెండ్ లో బాలకృష్ణ కేరెక్టర్స్ ఉంటాయి. బాలయ్య లోని నటనని పిండేసాడు బోయపాటి. ఇక నటించడానికి కూడా ఏం లేదు అనేలా రెండు సినిమాల్లో బాలయ్య కేరెక్టర్స్ ని డిజైన్ చేసాడు. తాజాగా #BB3 లో బాలయ్యని పవర్ ఫుల్ గెటప్ లో మరోసారి ప్రెజెంట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ రోజు బాలయ్య పుట్టిన రోజు కానుకగా ఒకరోజు ముందే #BB3 టీజర్ వదిలాడు బోయపాటి.

Advertisement
CJ Advs

బోయపాటి - బాలయ్య కాంబో అంటే ఎలా ఉంటుందో అనేది మరోసారి ఈ #BB3 లో ఉంటుంది అని నందమూరి ఫాన్స్ అనుకున్నట్టుగానే బోయపాటి బాలక్రిష్ణని చూపించాడు. పంచె కట్టి.. బాలయ్య విలన్స్ ని ఉతుకుతూనే చెప్పే డైలాగ్స్ నందమూరి ఫ్యాన్స్ కి కిర్రెక్కించాయి. ఎన్టీఆర్ బయోపిక్, రూలర్, పైసా వసూల్ అంటూ వరస ప్లాప్స్ తో బాగా వెనకబడిన బాలకృష్ణ కి బోయపాటి ఖచ్చితంగా హిట్ ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. బాలయ్యని మళ్ళీ పవర్ ఫుల్ గా చూపించడమే కాదు.... పొలిటికల్ గా బాలకృష్ణ కి బూస్ట్ ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది.

బాలయ్య ఖచ్చితంగా ఈ సినిమాతో మళ్ళీ లేవడం ఖాయం. అయితే బోయపాటి బాలయ్యని పొలిటికల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నాడని.. కొంతమంది మినిస్టర్స్ మీద పొలిటికల్ గా సెటైర్స్ కూడా వేయిస్తాడని.. ఇప్పటికే విడుదలైన #BB3 టీజర్ లో అధికారంలో ఉంది.. చంద్రబాబుని, బాలయ్యని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్న కొడాలి నాని కి పంచ్ వేసినట్లుగా ఉందని బాలయ్య అభిమానులు అంటున్నారు. కొడాలి నాని మంత్రి పదవిలో ఉండి బూతులతో రెచ్చిపోతున్నాడు. నానికి స్ట్రాంగ్ కౌంటర్లు ఈ సినిమాలో ఉండబోతున్నాయని నందమూరి అభిమానుల ఫీలింగ్.

Click Here for Teaser

Balayya Power Punch on Kodali Nani in BB3 teaser :

Balayya and Boyapati 3 Movie Teaser Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs