బాలీవుడ్‌లో కొన్నాళ్ల క్రితం ఆమీర్ ఖాన్ చిత్రాలు కోట్లలో కలెక్షన్స్ రాబట్టాయి.. లగాన్, దంగల్, పీకే ఇలా చాలా సినిమాలు. అయితే ఆమీర్ ఖాన్ కెరీర్ లో గుర్తుంది పోయే చిత్రాల్లో లగాన్ ఒకటి. ఇప్పుడు ఈ లగాన్ సినిమాకి RRR పోలిక అంటూ.. ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమీర్ ఖాన్ లగాన్ లోని లవ్ ట్రాక్ కి RRR లోని ఎన్టీఆర్ లవ్ ట్రాక్ కి పోలిక ఉంటుంది అని.. లగాన్‌ని రాజమౌళి మరోసారి గుర్తు చేయబోతున్నాడని అంటున్నారు.
లగాన్ సినిమాలో ఓ బ్రిటిష్ అమ్మాయి ఆమీర్ ఖాన్ ని చూసి మనసుపారేసుకుంటుంది. బ్రిటిష్ అమ్మాయి.. క్రికెట్ లో ఇండియా గెలవని ప్రార్థిస్తుంది. దాని కోసం ఆ బ్రిటిష్ అమ్మాయి తనకి తోచిన సహాయం చేస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ RRR లో కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మారిస్ ని హీరోయిన్ గా ఎపిక చేసాడు రాజమౌళి. కొమరం భీమ్ ని ఆ హాలీవుడ్ హీరోయిన్ చూసి ఇష్టపడి.. బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు సహాయ పడుతుంది. బ్రిటిష్ దేశం అమ్మాయి అయ్యుండి.. కొమరం భీమ్‌కి సహాయం చేయడం అనేది ఎన్టీఆర్ ట్రాక్ లో మెయిన్ హైలెట్ అట. మరి లగాన్ లవ్ ట్రాక్ తో పోలిక ఉన్నప్పటికీ.. రాజమౌళి దాన్ని ఇంట్రెస్టింగ్‌గా మరో ట్రాక్ లోకి ఎక్కిస్తాడు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.