Advertisement
Google Ads BL

కాన్సెఫ్ట్ చెప్పారు.. రామ్ చరణ్ దర్శకుడెవరో?


RRR‌లో నటిస్తున్న రామ్ చరణ్ - ఎన్టీఆర్‌లలో తమ నెక్స్ట్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఒక్కడే ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. త్రివిక్రమ్‌తో తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టేశాడు. కానీ రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఓ పాత్ర చెయ్యాలి కనక తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత ఏ డైరెక్టర్‌తో చెయ్యబోతున్నాడో అనేది కనీసం చిన్న లీక్ కూడా లేదు. తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ ని రామ్ చరణ్ తన తండ్రికి తగిలిస్తున్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉండగా.. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కథ పై సోషల్ మీడియాలో ఓ పుకారు మొదలైంది.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ RRR లో అల్లూరి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే తన నెక్స్ట్ మూవీ లో రామ్ చరణ్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రే చేయబోతున్నాడని... ఆస్తి కోసం ఓ పాపను వెంటాడే గ్యాంగ్ నుండి కాపాడే పోలీస్ గా రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఏ డైరెక్టర్ ఈ కథ చరణ్ కి చెప్పాడో తెలియదు కానీ... ఈ కథలోనే రామ్ చరణ్ నటించబోతున్నాడని న్యూస్ మాత్రం కరెక్ట్ అంటారా.. ఏమో చూడాలి ఇందులో నిజమెంతుందో అనేది. ఇక ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర అద్భుతంగా ఉంటుంది అని... ‘ఆచార్య’కే రామ్ చరణ్ పాత్ర హైలెట్ అంటున్నారు.

Rumors on Ram Charan next Film :

After RRR, Ram Charan movie Story Out 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs