Advertisement
Google Ads BL

చరణ్ నెక్స్ట్ సినిమా ప్రకటనే లేదు..అప్పుడే కథ అల్లేస్తున్నారు..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎవరి దర్శకత్వంలో నటిస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్ చరణ్, ఆ తర్వాత ఎలాంటి పాత్రలని ఎంచుకుంటాడనేది ఆసక్తిగా ఉంది. అయితే ఇటు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటూనే మెగాస్టార్ ఆచార్య సినిమాలో కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీదే ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఈ రెండింటి తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడనే విషయమై అనేక వార్తలు వస్తున్నాయి. ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే విషయమై ఇంకా క్లారిటీ రాకముందే రామ్ చరణ్ సినిమా కథ గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. తన తర్వాతి చిత్రంలో రామ్ చరణ్ పోలీస్ అఫీసరుగా కనిపించనున్నాడట. ఆస్తి కోసం చిన్న పాపని చంపడానికి ప్రయత్నించే విలన్ల నుండి కాపాడే పోలీస్ గా రామ్ చరణ్ కనిపిస్తాడని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ లైన్ ని చూస్తుంటే చిరంజీవి పసివాడి ప్రాణం గుర్తుకు వస్తుంది. మరి ఈ లైన్ ని కావాలనే సృష్టించారో లేదా నిజంగా నిజమో అనే విషయం మాత్రం తెలియదు. కాకపోతే ఒక్క విషయం, ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రం త్రివిక్రమ్ తో ఉంటుందని ప్రకటించినప్పటి నుండి రామ్ చరణ్ పై ఒత్తిడి పెరిగింది. అయితే ప్రస్తుతం అటు ఆర్ ఆర్ ఆర్ లోనూ, ఇటు ఆచార్యలోనూ నటిస్తున్న రామ్ చరణ్, ఇప్పుడప్పుడే తన నెక్స్ట్ చిత్రం గురించి బయటకి వెల్లడించే అవకాశం లేదు.

News about Ram Charan next movie story..:

News about Ram Charan next movie story..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs