ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీస్ అయిన అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వర రావు, నాగార్జున, అఖిల్, చైతులతో కలిసి ఎప్పటికి గుర్తుండిపోయేలా మనం చేసారు. ఇక మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ చిరు ఆచార్యలో నటిస్తున్నారు. అలా మెగా అభిమానుల కోరిక కూడా సగం తీరినట్టే. కానీ నందమూరి అభిమానుల కోరిక మాత్రం ఇప్పట్లో తీరేలా లేదు. కారణం బాలయ్యకి ఎన్టీఆర్‌కి పడదు. మధ్య మధ్యలో కలిసిన ఉప్పు నిప్పులా ఎన్టీఆర్ - బాలయ్య ఉంటారనేది తెలిసిన సత్యం, అయితే తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు ఇంటర్వూస్ అంటూ ఇప్పుడు ఛానల్స్ లోను, యూట్యూబ్ ఛానల్స్ లోను బాలయ్యే కనబడుతున్నాడు. అటు రాజకీయాలు, ఇటు సినిమాల గురించి ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్నాడు బాలయ్య.
అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో అభిమానుల కోసం మల్టీస్టారర్ ఎప్పుడు చేస్తారని అడిగితే.. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ తో కలిసి సినిమా చెయ్యడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ మాకున్న క్రేజ్ కి ఇమేజ్‌కు తగ్గ కథ సెట్ అయితే తప్పకుండా మేమంతా కలిసి మల్టీస్టారర్ చేస్తామన్నారు. ఏదో చేయాలంటే చేయాలని కాదు.. కానీ మేమందరం కలిసి ఓ సినిమాలో నటిస్తే అది తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోయేలా ఉండే సబ్జెక్ట్ అయితే బాగుంటుందన్నాడు. మరి బాలయ్య చెప్పిన విధంగా ఓ మంచి కథని నందమూరి హీరోల కోసం ఎవరైనా డైరెక్టర్ రెడీ చేస్తారేమో చూద్దాం.