చాలామంది అభిమాన హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు వారిని అభిమానించే లేడీ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యి ఫీలవుతారు. అయితే ఇప్పుడో స్టార్ హీరో మాత్రం నా ఫేవరెట్ హీరోయిన్ పెళ్లయినప్పుడు నేను చాలా ఫీలయ్యాను.. నేను పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది అమ్మాయిలు నాకు మెస్సేజ్ లు అవి పెట్టి బాధపడుతున్నామని చెప్పారు. మరి నేను కూడా నా హీరోయిన్ పెళ్లయినప్పుడు బాగా బాధపడ్డా అంటున్నాడు. ఆయనే ‘పుష్ప’తో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్న అల్లు అర్జున్. ఐశ్వర్య రాయ్ అంటే అల్లు అర్జున్‌కి చాలా ఇష్టమట. ఐష్ పెళ్లయినప్పుడు అల్లు అర్జున్ తెగ బాధపడ్డాడట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఇలా చెప్పాడు.
ఇక తనకి బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఏదంటే.. రుద్రమదేవి అంటున్నాడు. పారితోషకం తీసుకోకుండా ఓ దేశభక్తుడు పాత్ర చేసే సంతృప్తిగా ఫీలయ్యా అంటున్నాడు. ఇక తనకి కారుల టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతుంది అని.... ప్రస్తుతం ఎస్ యువి రేంజ్ రోవర్ వోగ్ వాడుతున్నా అని ఈమధ్యనే రెండున్నర కోట్లు పెట్టి కొన్నా అని చెబుతున్నాడు.
తనకిష్టమైన సినిమాలు టైటానిక్ అదే తెలుగులో ఇంద్ర, బాలీవుడ్‌లో గల్లీ బాయ్ అని చెబుతున్న అల్లు అర్జున్ కొడుకు అయాన్ కి పారిస్ అంటే ఇష్టమట. అందుకే ఏడాదికి ఒక్కసారైనా అక్కడికి వెళ్తాడట ఫ్యామిలీతో పాటుగా. ఇక మొదటి నుండి మైకేల్ జాక్సన్ అంటే ఇష్టమని, మైకేల్ మ్యూజిక్ వింటూ పెరిగా అని.. అందుకే ఇప్పటికీ స్టయిల్ గా ఉందని ట్రై చేస్తుంటా అని చెప్పిన అల్లు అర్జున్ ఇంట్లోనూ అలానే ఉంటా అని చెబుతున్నాడు. బాలీవుడ్ లో సోనమ్ కపూర్ స్టయిల్ నచ్చితే తెలుగులో విజయ్ దేవరకొండ స్టయిల్ నచ్చుతుంది అంటున్నాడు.