సినిమా సెలెబ్రిటీలకి సినిమాతో పాటుగా మరో వ్యాపారం ఉంటుంది. చాలా మంది హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాతో పాటుగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. హీరోయిన్లలో రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టింది. స్టార్ హీరోయిన్ సమంత ప్లే స్కూల్ స్టార్ట్ చేసింది. అయితే తాజాగా మరో హీరోయిన్ తాను పెట్టబోయే బిజినెస్ గురించి రివీల్ చేసింది.
దక్షిణాది హీరోయిన్ అయిన రాధికా ఆప్టే బాలీవుడ్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. హాట్ హాట్ గా కనిపిస్తూ ఎన్నో వివాదాస్పద సినిమాల్లో వివాదాస్పద పాత్రలు చేసిన రాధికా ఆప్టే, తెలుగులో బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో మెరిసింది. అయితే తాజాగా ఆమె వ్యాపారంలోకి దిగాలని ఆలోచిస్తుందట. వరుస సినిమాలలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా గడుపుతున్న రాధికా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటుందిట.
దీనికోసం అవసరం అయితే నటన మానేస్తానని శపథం కూడా చేస్తుంది. యాక్టర్ గా బిజీగా ఉన్న రాధికా, లాక్డౌన్ సమయాన్ని చాలా ప్రొడక్టివ్ గా గడిపిందట. లాక్డౌన్ లో ఉన్నప్పుడే తనకి వ్యాపారంలోకి దిగాలన్న ఆలోచన వచ్చిందని చెప్తుంది. మరి హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అందుకున్న రాధికా ఆప్టే, బిజినెస్ ఉమన్ గా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.