Advertisement
Google Ads BL

మీరా చోప్రా విషయంలో ఎన్టీఆర్ స్పందించడా?


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి, నటి మీరా చోప్రాకి మధ్యన జరుగుతున్న సోషల్ మీడియా యుద్ధమే. మాజీ హీరోయిన్ మీరా చోప్రా.. ఎన్టీఆర్ అంటే ఎవరో నాకు తెలియదు.. నేను ఆయన అభిమానిని కాదు అన్నందుకు గాను.. ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది మీరా చోప్రాకి సోషల్ మీడియాలోనే చుక్కలు చూపెడుతున్నారు. మీరా చోప్రా పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడమే కాదు... తెలంగాణ మంత్రి కేటీఆర్ కి కూడా ట్విట్టర్ నుండి మెస్సేజ్ పెట్టింది. అయితే మీరా చోప్రాకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులకు తమిళ నటి ఖుష్బూ మద్దతు పలకడం... తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మీరాకి కౌంటర్ వేయ్యడం,.. ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. కానీ అభిమానులకు ఓ సందేశం ఇవ్వడం లేదు. అభిమానులే తన బలం, వారికి సదా రుణపడి ఉంటా అంటూ ఎప్పుడు చెప్పే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా మౌనంగా ఉండడం చూస్తే మాత్రం.. ఎందుకు ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనిపిస్తుంది. మరోపక్క మీరా చోప్రా ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ ఎన్టీఆర్ స్పందించాలని, అభిమానులను కంట్రోల్ లో పెట్టుకోవాలంటూ ట్వీట్ చేసింది. అయినా ఎన్టీఆర్ సైలెంట్ నే మెయింటైన్ చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ తన అభిమానుల విషయంలో మనస్తాపానికి లోనయ్యాడని.. ఇంత హాట్‌గా ఉన్న టైం లో ఎన్టీఆర్ చెప్పినా అభిమానులు వినరనే ఉద్దేశ్యంతోనే మౌనంగా ఉన్నాడని చెబుతున్నారు.

Jr NTR maintained Silence in Meera Chopra and His Fans war:

Jr NTR not Reacted on his Fans war with Meera Chopra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs