Advertisement
Google Ads BL

కొలీవుడ్ పై కన్నేసిన తెలుగు హీరో..


టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ శ్రీకారం సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. కిషోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాలో శర్వా ఓ యువరైతుగా కనిపించనున్నాడు. గత కొన్ని రోజులుగా శర్వాకి సరైన హిట్ లేదు. పడి పడి లేచే మనసు మొదలుకుని, రణరంగం , జాను మొదలగు చిత్రాలన్నీ ఫ్లాపులుగా నిలిచాయి. దాంతో శ్రీకారం సినిమా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని విశ్వసిస్తున్నాడు.

Advertisement
CJ Advs

లాక్డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నాక ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా అనంతరం శర్వా తెలుగుతో పాటు తమిళ చిత్రంలోనూ కనిపించనున్నాడు. శర్వాకి గతంలో తమిళ సినిమాలు చేసిన అనుభవం ఉంది. అందువల్ల ఈ సారి తెలుగు, తమిళం బైలింగ్యువల్ సినిమాలో నటించబోతున్నాడు. ఖాకీ, ఖైదీ, వంటి విజయవంతమైన చిత్రాలని నిర్మించిన ఎస్ ఆర్ ప్రభు ఈ బైలింగ్యువల్ ని నిర్మించబోతున్నాడు.

శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడని సమాచారం. మరి శ్రీకారంతో తెలుగులో హిట్ అందుకుని, శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో తమిళంలో పాగా వేస్తాడేమో చూడాలి.

Telugu hero wanted to do a film in Tamil:

Sharwa doing a film in Telugu and tamil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs