Advertisement
Google Ads BL

క్రిష్‌కి ఝలక్.. పవన్ నెక్స్ట్ హరీష్‌తోనే..!!


పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా మారతాడో ఆయనకే ఓ క్లారిటీ లేదనేది ఆయన అభిమానులకు తెలిసిన విషయమే. రాజకీయాల్లోకి వెళ్లాడా.. అక్కడ ఎవరిని నమ్మడు ఒక్కడే మాట్లాడతాడు. ఇక సినిమాల్లో ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడో తెలియదు. పవన్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎప్పుడూ సిద్దమే.. క్రేజ్ అలాంటిది. కాకపోతే నిర్మాతలకు పవన్ తో పెట్టుకున్నాక కానీ తెలియదు. అసలు విషయం, పవన్ మెంటాలిటీ ఇలాంటిది అయినా పవన్ తో సినిమా కోసం తెగ ఇంట్రెస్ట్ చూపుతారు నిర్మాతలు. అలాంటి నిర్మాతలకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగానే చుక్కలు చూపిస్తాడు. తాజాగా పవన్ కోసం ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి.. ఇప్పుడు 100 కోట్లతో సినిమా మొదలెట్టిన ఏ ఏం రత్నం ని పవన్ అలానే ఇబ్బంది పెడుతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో సినిమాల మీద సినిమాలు మొదలెట్టాడు. వకీల్ సాబ్ ఎప్పుడో అవ్వాల్సింది కానీ కరోనా వల్ల ఆగింది. అలాగే క్రిష్ తో - ఏ ఏం రత్నం తో మరో పిరియాడికల్ మూవీ అది 100 కోట్ల బడ్జెట్ తో మొదలెట్టేసాడు. తర్వాత హరీష్ శంకర్ సినిమా. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ ముగియగానే వకీల్ సాబ్ పూర్తి చేసే పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా కోసం వెళ్ళడట. ముందు హారిష్ తో సినిమా చేయబోతున్నాడట. వకీల్ సాబ్ ఎలాగూ రీమేక్. తర్వాత పిరియాడికల్ మూవీ ఎందుకులే అని కొద్దిగా షూటింగ్ చేసిన సినిమాని పక్కనబెట్టి.. హరీష్ శంకర్‌తో పక్కా కమర్షియల్ మూవీ చేయబోతున్నాడట.

అందుకే హరీష్ కూడా స్క్రిప్ట్ పూర్తి చేసి నటుల ఎంపిక చేపట్టాడనే టాక్ నడుస్తుంది. పవన్ మళ్లీ బ్రేకివ్వడంతో.. వకీల్ సాబ్ తర్వాత మా మూవీనే అని క్రిష్ ఇప్పటికే టైటిల్ అండ్ హీరోయిన్ ని సెట్ చేసుకుని కూర్చుంటే ఇప్పుడు పవన్ ఇలా హ్యాండ్ ఇచ్చి హరీష్ తో మూవీకి మూవ్ అవడంతో.. క్రిష్ అండ్ బ్యాచ్ తలలు పట్టుకుందట. అయితే ఈ న్యూస్ గాసిప్పా లేదా అనేది తెలియాలంటే పవన్ కానీ, క్రిష్ కానీ స్పందిస్తేనే తెలుస్తుంది.

Paining Gossip on Pawan Kalyan and Krish Film?:

Shocking Gossip on Pawan and Krish Film!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs