Advertisement
Google Ads BL

రానని చెప్పకుండా బాలయ్య భలే ఇచ్చాడుగా!


ఎన్టీఆర్ జయంతి రోజున బాలకృష్ణ ఇండస్ట్రీ పెద్దలపై ఘాటైన వ్యాఖ్యలు చెయ్యడం.... నాగబాబు, సి కళ్యాణ్ లాంటోళ్ళు బాలయ్యకి కౌంటర్ వెయ్యడం, తర్వాత బాలయ్య బాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి మరీ అమెరికాలోని మా వేడుకల గురించి కౌంటర్ వెయ్యడం, బాలయ్య చేసింది రైట్ అంటూ కొందరు మద్దతు పలుకుతున్న సమయంలో తాజాగా ఏపీ సీఎం జగన్ తో భేటీ కోసం చిరు అధ్యక్షతన కొంతమంది ప్రముఖులు కలవడానికి సన్నద్దమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ కోసం కలిసినప్పుడు తనని ఎవడు పిలవలేదు అన్నందుకు గాను.. ఇప్పుడు బాలకృష్ణని కూడా సినిమా పెద్దలు జగన్ తో మీటింగ్ కోసం సి కళ్యాణ్ చేత ఆహ్వానం పలికించారు. మొన్న బాలయ్య మాట్లాడినప్పుడు ఎవరు ఎవరిని పిలవరు... అయినా బాలయ్య ఏంటి ఇలా మాట్లాడారు.. ఇలా మాట్లాడుతారనుకోలేదన్నాడు. తాజాగా సి కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ తో సినిమా ప్రముఖులు భేటీ అవుతున్నారని మీరు రావాలంటూ బాలకృష్ణ కి ఫోన్ చేసాడట.

Advertisement
CJ Advs

మరి అసలే మండుతున్న బాలయ్య పిలవగానే వెళ్తాడా? వెళ్ళడు.. ఇప్పుడదే చేసాడు. అది కూడా నా పుట్టిన రాజు వేడుకలు సందర్భంగా కొన్ని పూజలు, హోమాలు చేస్తున్నాం అందుకు నేను ఈ జగన్ మీటింగ్ కి హాజరు కాలేకపోతున్నాను అంటూ సి కళ్యాణ్ కి ఫోన్ లోనే చెప్పేశాడట. ఈ సమావేశం జూన్ 9 అంటే బాలయ్య పుట్టిన రోజు ముందు రోజు జరగనుంది. దానితో బాలయ్యకు ఆహ్వానం అందినా రాలేని పరిస్థితి. ఇక సి కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గ్రూపులు లేవని, బాలయ్య ఇలాంటి వాటిలో ముందుంటారు. కానీ పుట్టిన రోజు వల్లనే ఆయన ఈ సమావేశాలకు రాలేకపోయారని చెబుతున్నప్పటికీ... ప్రతి పక్షంలో ఉన్న బాలయ్య సీఎం జగన్ ని కలవడానికి ఇష్టపడటం లేదని, పూజలు ఉంటే మాత్రం మీటింగ్ కి హాజరవ్వొచ్చు.. కానీ నేను కెలికాక నన్ను పిలిస్తే మాత్రం నేను రావాలా? అనే అహంతోనే బాలయ్య ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మీటింగ్ కి హాజరవడం లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Balayya Reaction on Cine Officials and YS Jagan Meet:

Balakrishna Vs Chiranjeevi war continues.. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs