ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలకృష్ణ - చిరంజీవి మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంది. చిరు పేరెత్తకుండా బాలయ్య కెలుకుతున్నాడు. బాలయ్య ఏం అన్నా చిరు నోరెత్తడం లేదు. చిరు- నాగ్ నిర్మాతలు- దర్శకులు కలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కలవడం, తలసానితో సమావేశాలు పెట్టడంతో మండిన బాలయ్య ఇండస్ట్రీ పెద్దల మీద విరుచుకుపడుతున్నారు. అయితే ఇప్పడు బాలయ్య అన్నమాటలకు సపోర్ట్ పెరుగుతుండటం.. చిరు పెద్దరికాన్ని కొంతమంది జీర్ణించులేకపోతున్నారనే వార్తల నేపథ్యంలో చిరంజీవి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. అది ఇకపై ఇండస్ట్రీ పెద్దరికాన్ని తలకెత్తుకోను అని చిరు బాలయ్య వ్యవహారం విషయంలో స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నట్ట్టుగా తెలుస్తుంది.
అదే టైం లో బాలకృష్ణ ఇవ్వబోయే ఆతిథ్యానికి బాలయ్య చిరుని పిలుస్తాడా? చిరుని పిలిస్తే చిరు బాలయ్య ఆతిథ్యం అందుకోవడానికి వెళ్తాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ పుట్టిన రోజునాడు బాలయ్య తన 60వ పుట్టినరోజు స్పెషల్ గా షష్టి పూర్తి ప్లాన్ చేస్తున్నాడట. గతంలో చిరు కూడా తన 60 వ పుట్టినరోజుకి ఇండస్ట్రీని, ఆయన ఫ్రెండ్స్ అయిన ఇతర భాషల హీరోలకు గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టుగా బాలయ్య కూడా తన 60 వ పుట్టిన రోజు స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసి.. కరోనా కారణముగా ఇండస్ట్రీలోని ముఖ్యమైన కొన్ని కుటుంబాలను పిలిచి బాలయ్య ఓ రేంజ్ లో పార్టీ ఇవ్వబోతున్నాడని.. ఇప్పటికే ఆ ప్లానింగ్ అంతా పూర్తయ్యింది అని సమాచారం. అయితే ఈ పార్టీకి బాలయ్య ప్రస్తుత పరిస్థితులని బట్టి.. చిరుని పిలవకపోవచ్చని, పిలిస్తే అన్ని మనసులో ఉంచుకున్న చిరు వస్తాడా.. అంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే గతంలో బాలయ్య చిన్న పిల్లాడితో సమానం ఆవేశంలో ఎన్నో మాట్లాడతాడు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ చిరు ఎప్పటికప్పుడు చెబుతుంటాడు. మరి బాలయ్య పార్టీకి చిరు హాజరైనా, హాజరవకపోయినా.. అది మాత్రం హాట్ టాపిక్ అవడం గ్యారెంటీ.