Advertisement
Google Ads BL

ఉప్పెన విషయంలో సుకుమార్ హ్యాపీ.. రన్ టైమ్ లాక్డ్..!


సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలోని నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ అనే పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

Advertisement
CJ Advs

దేవిశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ఈ పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసాయి. కరోనా వల్ల థియేటర్లు మూతబడడంతో ఉప్పెన ఓటీటీలో విడుదల అవుతుందంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ చిత్రబృందం వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తారట. అయితే ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ ఈ మధ్యే పూర్తయిందట. ఫైనల్ ఔట్ ఫుట్ ని చూసిన నిర్మాత సుకుమార్ చాలా సంతృప్తిగా ఉన్నాడట.

ఫైనల్ ఎడిటింగ్ పూర్తి కావడంతో రన్ టైమ్ లాక్ చేసారట. 2 గంటల 30నిమిషాలకి లాక్ చేసారని వార్తలు వస్తున్నాయి. మెగా మేనల్లుడు పరిచయం కాబోతున్న ఈ సినిమా థియేటర్లు తెర్చుకోగానే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Sukumar happy with Uppena fginal cut..Run time locked:

Sukumar happy with Uppena fginal cut..Run time locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs