Advertisement
Google Ads BL

‘ఫ్రెండ్ షిప్’ మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి స్పందన


హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ మూవీ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్  విడుద‌ల‌

Advertisement
CJ Advs

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్.. ఇప్పుడు హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్ షిప్’ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, త‌మిళ న‌టుడు స‌తీష్‌ న‌టిస్తున్నారు. కాగా ఈరోజు ‘ఫ్రెండ్ షిప్’ మూవీ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, ‌లోస్లియా మ‌రియ‌నేస‌న్ క‌లిసి ఉన్న ఈ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హర్భజన్ సింగ్, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, త‌మిళ న‌టుడు స‌తీష్‌, లోస్లియా మ‌రియ‌నేస‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్: వేల్‌మురుగ‌న్‌, రాబిన్‌, ప్రొడ్యూస‌ర్స్: జెపిఆర్ & స్టాలిన్, ద‌ర్శ‌క‌త్వం: జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య.

Click Here for Motion Poster

Friendship Official First Look Motion Poster released:

Harbhajan Singh Friendship Movie Motion poster out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs