Advertisement
Google Ads BL

సూప‌ర్ హిట్ట‌యిన ‘లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు’


న‌టి ల‌క్ష్మీ మంచు త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‘లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు’ అనే టాక్ షో నిర్వ‌హిస్తున్నారు. ఈ టాక్ షోలో భాగంగా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో లైవ్‌లో సంభాషిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ రానా, ఆర్జీవీ, ర‌కుల్ ప్రీత్‌, జి. కృష్ణారెడ్డి, శ‌శి థ‌రూర్‌, పుల్లెల గోపీచంద్‌తో స‌హా 17 మంది ఫేమ‌స్ వ్య‌క్తుల‌తో లైవ్‌లో సంభాషించారు. అనేక‌మందికి స్ఫూర్తినిస్తోన్న ఈ షోకు అన్ని వైపుల నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుండ‌టం విశేషం. షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంలో ల‌క్ష్మీ మంచు మొద‌ట్నుంచీ ఎంతో నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నారు. లాస్ వేగాస్ అనే అమెరిక‌న్ టెలివిజ‌న్ సిరీస్‌లో న‌టించ‌డం ద్వారా ఆమె న‌ట‌నా రంగంలో అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత‌ కొన్ని ఇంగ్లీష్ టీవీ షోల‌లో న‌టించి, అప్పుడు టాలీవుడ్‌లో ప్ర‌వేశించారు. తొలి సినిమా ‘అన‌గ‌న‌గా ఓ ధీరుడు’లో అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్రద‌ర్శించి బెస్ట్ విల‌న్‌గా నంది అవార్డ్ అందుకొని సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత కూడా ప‌లు సినిమాల్లో చ‌క్క‌ని ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నారు. మ‌రోవైపు టీవీ షోల ప్రెజెంట‌ర్‌గానూ త‌న‌దైన ముద్ర వేశారు. ఆమె చేసిన టీవీ షోల‌లో ‘ప్రేమ‌తో మీ ల‌క్ష్మి’, ‘మేము సైతం’, ‘మీ కోసం’ వంటివి పాపుల‌ర్ అయ్యాయి. వాటితో పాటు ఫీట్ అప్ అనే సెల‌బ్రిటీ చాట్ షోకు కూడా ల‌క్ష్మీ మంచు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇది గ‌త ఏడాది ‘వూట్‌’లో ప్ర‌సార‌మైంది.

Advertisement
CJ Advs

‘లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు’లో ఇప్ప‌టివ‌ర‌కూ భాగ‌స్వాములైన సెల‌బ్రిటీలు:

1. రిచ‌ర్డ్ లాస‌న్ (మాస్ట‌ర్ యాక్టింగ్ కోచ్‌, లాస్ ఏంజెల్స్‌)

2. డాక్ట‌ర్ న్యూట‌న్ కొండ‌వీటి (పాస్ట్ లైఫ్ రిగ్రెష‌న్ మాస్ట‌ర్‌)

3. ట్రేసీ స్టాన్లీ (ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత యోగ నిద్ర టీచ‌ర్‌)

4. అనుష్క ప‌ర్వాణీ (మాస్ట‌ర్ యోగా టీచ‌ర్‌, ముంబై)

5. జి. కృష్ణారెడ్డి (మినిస్ట‌ర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండియా)

6. ఆర్జీవీ (ఫిల్మ్ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌)

7. శిల్పారెడ్డి (న్యూట్రిష‌నిస్ట్‌, స్టైలిస్ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌)

8. శ‌శి థ‌రూర్ (లోక్‌స‌భ స‌భ్యులు)

9. ర‌కుల్ ప్రీత్ సింగ్ (మోడ‌ల్‌/న‌టి)

10. పుల్లెల గోపీచంద్ (భార‌త బ్మాడ్మింట‌న్ టీమ్ చీఫ్ కోచ్‌, భారత బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు)

11. మ‌హిమ దాట్ల (ఎండీ, బ‌యోలాజిక‌ల్ ఈ లిమిటెడ్‌)

12. డాక్ట‌ర్ ర‌ష్మీ శెట్టి (సెల‌బ్రిటీ డెర్మ‌టాల‌జిస్ట్‌)

13. రానా ద‌గ్గుబాటి (న‌టుడు, నిర్మాత‌)

14. డాక్ట‌ర్ స‌చ్ మోహ‌న్ (సెల‌బ్రిటీ కాస్మెటిక్ ఫిజీషియ‌న్‌, కోవిడ్ నుంచి కోలుకున్న వ్య‌క్తి)

15. డాక్ట‌ర్ వ‌రూధిని (థెర‌పిస్ట్‌, ‘ఇన్న‌ర్‌-క‌నెక్ట్’ స‌హ వ్య‌వ‌స్థాప‌కురాలు)

16. డాక్ట‌ర్ శ్రీ‌ల‌క్ష్మి (ఎం.డి., సైకియాట్రిస్ట్‌)

17. అంజుమ్ బాబూఖాన్ (గ్లెన్‌డేల్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌, ఎడ్యుకేట‌ర్‌, ర‌చ‌యిత‌, టెడ్ఎక్స్ స్పీక‌ర్‌).

Locked Up With Lakshmi Manchu Is A Winner:

<span>Actress Lakshmi Manchu started her own talk show called Locked up with Lakshmi Manchu on her Instagram account</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs