Advertisement
Google Ads BL

ఇది ఓ సినిమా రచయిత ప్రేమకథ


నాగవర్మ బైర్రాజు‌ను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యారావు కథానాయిక. చిత్రం గురించి దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ.. ‘‘ఓ సినిమా రచయిత ప్రేమకథ ఇది. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. ప్రేమకథా చిత్రాల్లో విభిన్నంగా ఉంటుంది’’ అని తెలిపారు.

Advertisement
CJ Advs

ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ అధినేత మాట్లాడుతూ.. ‘‘చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో నిర్మాణం జరిగింది. టైటిల్ త్వరలో నిర్ణయిస్తాం. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ రిలేజ్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా విడుదలకు సిద్ధమైంది. లాక్ డౌన్ పూర్తయ్యాక సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.

నాగవర్మ బైర్రాజు, దివ్యారావు జంటగా నటించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం, పృథ్విరాజ్, సురేష్, కయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం. సంగీతం సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం వేణు మురళీధర్, ఎడిటర్ మేనగ శ్రీను, దర్శకత్వం హరిచందన్.

Naga Varma Byrraju Birthday special look released:

Director Harichandan comes with A Writers Love Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs